పరీక్షించాకే వేసుకోండి...

మేకప్‌ వేసుకోవడం బాగానే ఉంటుంది కానీ... సరైన దిశలో దాన్ని వాడకపోతే మాత్రం చర్మం పాడవుతుంది. నల్లగా మారుతుంది, దద్దుర్లు, మొటిమలు వంటివి వస్తాయి. అందుకే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

Updated : 17 Oct 2021 06:48 IST

మేకప్‌ వేసుకోవడం బాగానే ఉంటుంది కానీ... సరైన దిశలో దాన్ని వాడకపోతే మాత్రం చర్మం పాడవుతుంది. నల్లగా మారుతుంది, దద్దుర్లు, మొటిమలు వంటివి వస్తాయి. అందుకే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

* చేతులు ఎంత శుభ్రంగా ఉన్నా సరే.. మేకప్‌ వేసుకునే ముందు ఓసారి కడుక్కోవడం నియమంగా పెట్టుకోండి. ఇది ప్రాథమికంగా పాటించాల్సిన జాగ్రత్త. మాయిశ్చరైజర్‌ రాసుకున్నాకే అలంకరణ చేసుకోవడం వల్ల మేకప్‌ తాలూకు రసాయనాలు చర్మానికి హాని చేయవు.

* ఇతరుల మేకప్‌ సామగ్రి వాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. లేదంటే అలర్జీలు ఎదురవుతాయి. మరీ తప్పనిసరి అయితే ఓ సారి పరీక్షించుకుని, ఏ ఇబ్బందీ లేదని నిర్ధరించుకున్నాకే వాడాలి.

* కళ్లకు వేసుకునే మేకప్‌ కొన్నిసార్లు పడక ఇన్‌ఫెక్షన్‌ రావచ్చు. కళ్లమంట, ఎరుపు, నీళ్లుకారడం వంటి సమస్యలు కనిపిస్తే.. వెంటనే మానేయండి. చల్లటి నీళ్లతో కళ్లను శుభ్రం చేసుకోండి. అప్పటికీ పోవట్లేదంటే పచ్చిపాలల్లో ముంచిన దూదితో తుడిచేయండి.

* మేకప్‌ ఉత్పత్తులకీ ముగింపు తేదీ ఉంటుంది. ఆ గడువు లోపలే వాడాలి. కొత్త ఉత్పత్తులను శాంపిల్‌ టెస్ట్‌ చేయకుండా వినియోగించడం మంచిది కాదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్