మోము అందానికి గులాబీ నీళ్లు..

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉన్నా.. చర్మ సంరక్షణపై దృష్టిపెట్టేది మాత్రం కొందరే.  తీరిక లేనివారు...ఈ సులువైన చిట్కాలను పాటిస్తే సరి.

Published : 18 Oct 2021 00:58 IST

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉన్నా.. చర్మ సంరక్షణపై దృష్టిపెట్టేది మాత్రం కొందరే.  తీరిక లేనివారు...ఈ సులువైన చిట్కాలను పాటిస్తే సరి.

* స్పూను అవిసెగింజలపొడికి కాసిన్ని పాలు కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి వృత్తాకారంలో సున్నితంగా రుద్దాలి. రెండు నిమిషాల తర్వాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తడి ఆరాక.. రెండు స్పూన్ల పెరుగుకు అరస్పూను తేనె, చిటికెడు పసుపు చేర్చి ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. పదినిమిషాలు ఉంచి, కడిగేయాలి. ఈసారి ఫేస్‌వాష్‌ వాడొద్దు. నీటినే ఉపయోగించాలి. తర్వాత రోజ్‌వాటర్‌ను ముఖంపై స్ప్రే చేయాలి. ఆపై మాయిశ్చరైజర్‌ రాస్తే చాలు.

గుప్పెడు గులాబీరేకల్ని పేస్ట్‌లా చేసి దానికి చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలపాలి. దీంతో ముఖానికి ప్యాక్‌ వేయాలి. పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖం తాజాగా కనిపిస్తుంది.

కలబంద గుజ్జులో కాస్త రోజ్‌వాటర్‌, చెంచా తేనె కలిపి చర్మానికి రాయాలి. ఆరాక కడిగేస్తే చాలు. ఇది పొడిబారిన చర్మానికి తేమ అందిస్తుంది. కళ తగ్గిన ముఖానికి వన్నె తెస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్