రోజూ తాజాగా ఉండాలంటే...

కొందరు ఎన్నిసార్లు ముఖం శుభ్రం చేసుకున్నా జిడ్డు కారుతున్నట్లే ఉంటుంది. మరికొందరిది ఉదయం నుంచే పేలవంగా కనిపిస్తుంది. నిత్యనూతనంగా, తాజాగా కనిపించడానికి సౌందర్యనిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.

Updated : 20 Oct 2021 05:26 IST

కొందరు ఎన్నిసార్లు ముఖం శుభ్రం చేసుకున్నా జిడ్డు కారుతున్నట్లే ఉంటుంది. మరికొందరిది ఉదయం నుంచే పేలవంగా కనిపిస్తుంది. నిత్యనూతనంగా, తాజాగా కనిపించడానికి సౌందర్యనిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.
నిద్ర లేవగానే టిష్యూ పేపర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అప్పుడే చర్మం తీరును గుర్తించొచ్చు. దానికి తగినట్లుగా సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. మేకప్‌ వేసే ముందు ముఖాన్ని మూడు రకాలుగా క్లెన్సింగ్‌ చేయాలి.
* ముందుగా చర్మంలోని నూనెను తొలగించడానికి ఫేస్‌వాష్‌తో శుభ్రం చేయాలి. ఆపై స్క్రబ్‌ చేసి, ఆవిరి పడితే.. మృతకణాలతోపాటు చర్మరంధ్రాల్లోని బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. ఆ తర్వాత వేసే మేకప్‌ వల్ల చర్మం పెద్దగా ప్రభావితం కాదు.
* రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మేకప్‌ లేకుండా ముఖాన్ని శుభ్రపరచాలి. ఆ తర్వాత సీరం, మాయిశ్చరైజర్‌ అప్లై చేస్తే స్కిన్‌ తేమను కోల్పోకుండా ఉండటమే కాదు, ఉదయానికి తాజాగా కూడా మారుతుంది.
* తాజా కూరగాయలు, పండ్లు సలాడ్స్‌ను తీసుకోవడం, ఆరేడు గ్లాసుల నీటిని తాగడం వంటి అలవాట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మొటిమలు, మచ్చలనూ దరి చేరనివ్వవు. అప్పుడిక ముఖం నిత్య నూతనంగా, మెరుపులీనుతూ కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్