కురులకు కెరటిన్‌ చికిత్స...

రజిత బరకగా అనిపించే తన కురులను పట్టులా మృదువుగా.. మెరిసేలా చేయడానికి ఎన్నో చిట్కాలు పాటించినా ఫలితం లేదు. స్ట్రెయినింగ్‌ చేయించుకోవాలంటే రాలిపోతాయని భయం.

Updated : 29 Feb 2024 17:15 IST

రజిత బిరుసుగా అనిపించే తన కురులను పట్టులా మృదువుగా.. మెరిసేలా చేయడానికి ఎన్నో చిట్కాలు పాటించినా ఫలితం లేదు. స్ట్రెటనింగ్‌ చేయించుకోవాలంటే రాలిపోతాయని భయం. ఇలాంటప్పుడు ఇంట్లోనే కెరటిన్‌ చికిత్స చేసుకోవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు. అదెలాగోచూడండి...

 సహజంగా... ఇంట్లో తయారు చేసుకునే సహజ సిద్ధమైన లేపనంతో శిరోజాలను స్ట్రెయిట్‌గా చేసుకోవచ్చు. ఇందుక్కావలసినవి... బియ్యం, మొక్కజొన్న పిండి, కొబ్బరి, ఆలివ్‌నూనె, నీళ్లు. ముందుగా నాలుగు చెంచాల బియ్యాన్ని పాన్‌లో వేసి, రెండు గ్లాసుల నీళ్లు పోసి జావలా ఉడికించి చల్లార్చాలి. ఈ జావను మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఓ చిన్న గిన్నెలో చెంచా మొక్కజొన్న పిండి వేసి, అరకప్పు నీళ్లు పోసి ఉండల్లేకుండా కలపాలి. దీన్ని అన్నం జావకు కలిపి 2, 3 నిమిషాలు ఉడికించాలి. పొయ్యి మీద ఉన్నంతసేపూ ఈ మిశ్రమాన్ని ఉండ  కట్టకుండా కలుపుతూనే ఉండాలి. తర్వాత చల్లార్చి ఇందులో చెంచా చొప్పున కొబ్బరి, ఆలివ్‌ నూనెలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి కురుల చివర్ల వరకు పట్టించాలి. ఓ గంట ఆరనిచ్చి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు. కురులకు కెరటిన్‌ చికిత్స అంది, మృదువైన, ఒత్తైన జుట్టు సొంతమవుతుంది.

 ప్రయోజనాలు.. బియ్యంలోని అమైనో యాసిడ్స్‌, బి, ఇ విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా పెరగడానికి దోహద పడతాయి. కొబ్బరినూనె శిరోజాలకు మెరుపు, మృదుత్వాలను ఇస్తుంది. ఆలివ్‌ నూనె జుట్టు చివర్లు చిట్లకుండా పరిరక్షించడమే కాదు, పోషకాలూ ఇస్తుంది. రసాయన రహితంగా చేసుకునే ఈ చికిత్స శిరోజాలను నిత్యం ఆరోగ్యంగా ఉంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్