ముఖచర్మంపై మ్యాజిక్‌

ఏదైనా వేడుకకు హాజరు కావాలంటే అప్పటికప్పుడు ముఖాన్ని మెరిసేలా చేసే శక్తి అవిశగింజల జెల్‌లో ఉంది. ఇంట్లోనే నిమిషాల్లో తయారు చేసుకోగలిగే ఈ జెల్‌తో మ్యాజిక్‌ ఎలా చేయొచ్చో తెలుసుకుందాం.

Updated : 28 Oct 2021 06:22 IST

ఏదైనా వేడుకకు హాజరు కావాలంటే అప్పటికప్పుడు ముఖాన్ని మెరిసేలా చేసే శక్తి అవిశగింజల జెల్‌లో ఉంది. ఇంట్లోనే నిమిషాల్లో తయారు చేసుకోగలిగే ఈ జెల్‌తో మ్యాజిక్‌ ఎలా చేయొచ్చో తెలుసుకుందాం.

తయారీ.. పావుకప్పు అవిశగింజలకు రెండు కప్పుల నీటిని కలిపి పదినిమిషాలు ఉడికించాలి. చల్లారాక చిక్కగా వచ్చిన జెల్‌ను విడిగా వడకట్టి పొడి సీసాలో భద్ర పరుచుకోవాలి. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని వారం పాటు వినియోగించుకోవచ్చు.

* మొదటి దశలో... ముఖాన్ని శుభ్రపరుచుకున్నాక రెండు చెంచాల అవిశ జెల్‌ను తీసుకుని, చెంచా తేనె/ పాలు వేసి, అప్లై చేసి, మర్దన చేయాలి. తర్వాత చల్లనినీటితో కడిగేయాలి. దీంతో చర్మంపై మురికి పోతుంది.

* రెండో దశలో.. స్క్రబ్బింగ్‌ కోసం రెండు చెంచాల అవిశగింజలను మిక్సీలో మెత్తగా పొడిలా చేయాలి. ఇందులో జెల్‌ను రెండు చెంచాలు వేసి పేస్టులా చేసుకొని ముఖానికి పట్టించాలి. మృదువుగా 5 నిమిషాలు మర్దనా చేసి కడిగేస్తే చాలు... చర్మ రంధ్రాల్లోని మురికి పోతుంది.  

* మూడో దశలో.. చర్మరంధ్రాలను మూయడానికి ఓ గిన్నెలో చెంచా జెల్‌ను తీసుకోవాలి. దీనికి సమాన పరిమాణంలో గ్లిజరిన్‌ / కలబంద గుజ్జు / రోజ్‌వాటర్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మృదువుగా రాసి మర్దన చేయాలి. దీంతో చర్మం బిగుతుగా మారుతుంది.

* నాలుగోదశలో.. రెండు చెంచాల గోధుమపిండికి సరిపడినంత జెల్‌ వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి అయిదు నుంచి పది నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత చేతివేళ్లను తడిచేసుకుని మృదువుగా మర్దనా చేసి, చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మెరిసే మోము మీ సొంతమవుతుంది. నలుగురిలోనూ మిమ్మల్ని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది.

ప్రయోజనాలు.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉండే ఈ జెల్‌ చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేసి మృదుత్వాన్ని, మెరుపును అందిస్తుంది. ముడతలను పోగొట్టి,  వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. మచ్చలను మాయం చేసే ఔషధగుణాలు అవిశగింజల్లో ఉన్నాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, శాశ్వత ప్రయోజనాలనూ అందిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్