Published : 02/11/2021 00:40 IST

మెరిసే చర్మం కోసం..

ఓ పక్క పండగ, మరోపక్క పెళ్లిళ్లు వేడుకలు. వీలైనంత త్వరగా ముఖాన్ని మెరిసేలా చేసుకోవాలనుకునేే అమ్మాయిలకు కొన్ని సూచనలిస్తున్నారు సౌందర్యనిపుణులు.
ఉదయం ముఖాన్ని ఐస్‌క్యూబ్‌తో చేసే మర్దన చర్మంలోని నూనెను తొలగించి మృదువుగా మారుస్తుంది. అలాగే రెండు చెంచాల కలబంద గుజ్జుకు, అరచెంచా పసుపు, చెంచా పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసి ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరిచి, మాయిశ్చరైజర్‌ను రాయాలి. ఇలా చేస్తే చర్మం ఆరోగ్యంగా మారుతుంది.
* విటమిన్‌ సితో చేసిన సీరం కళావిహీనంగా ఉండే చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది. నిద్రపోయే ముందు ముఖానికి మృదువుగా రాసి మర్దనా చేసి వదిలేయాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చేస్తే వారంరోజుల్లో చర్మంలో క్రమేపీ మార్పు వస్తుంది.
* రెండు చెంచాల ఓట్‌మీల్‌కు తలా చెంచా పెరుగు, తేనె, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంటసేపు ఆరనివ్వాలి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇది చర్మరంధ్రాల్లో రక్తప్రసరణను మెరుగుపరిచి, కాంతిని అందిస్తుంది. వారానికి రెండుసార్లు ఈ లేపనం వేస్తే మంచిది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని