పండక్కి మేకప్‌ మెరుపులు...

పండగల వేళ ప్రత్యేకంగా కనిపించాలంటే... ముఖానికి కాస్త మెరుగులద్దాల్సిందే. అందుకోసమే ఈ సింపుల్‌ మేకప్‌ టిప్స్‌.

Updated : 03 Nov 2021 06:13 IST

పండగల వేళ ప్రత్యేకంగా కనిపించాలంటే... ముఖానికి కాస్త మెరుగులద్దాల్సిందే. అందుకోసమే ఈ సింపుల్‌ మేకప్‌ టిప్స్‌.

* ప్రత్యేక సందర్భాల్లో కళ్లను మెరిపించాలనుకున్నప్పుడు కేవలం మస్కారా వేసుకుంటే సరిపోదు. పసిడి రంగుతో కళ్లను తీర్చిదిద్దాల్సిందే. అలంకరణ పరిభాషలో దీన్నే స్మోకీ ఐస్‌ అంటారు. మన భారతీయుల చర్మతత్వానికి ఈ పసిడిరంగుతో చేసే అలంకరణ చక్కగా నప్పుతుంది.

* ముందుగా కళ్ల అడుగున కన్సీలర్‌ రాసుకోవాలి.. దీనివల్ల నల్లని వలయాలు కనిపించకుండా ఉంటాయి. ఆపై ప్రైమర్‌ రాసి...ఐషాడో వేస్తే ఎక్కువ సేపు కళ్లు తాజాగా ఉంటాయి.

* కొన్నిరకాల ఐషాడోలు అంటే గ్రే, ముదురు రంగులు కళ్లని అలసిపోయినట్టు కనిపించేలా చేస్తాయి. దాంతో వయసు మరీ ఎక్కువగా కనిపిస్తుంది. బదులుగా లేత రంగులు వేస్తే చిన్నవయసువారిలా కనిపిస్తారు.

* ద్రవరూపంలో ఉన్న లైనర్‌ కన్నా జెల్‌ రకాన్ని వాడితే మంచిది. మస్కారాని కూడా ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. కనురెప్పల పైభాగంలోనే మస్కారాని వేయాలి తప్పించి... అడుగున భాగంలో కాదు.

* ముఖంపై ముడతలని దాచిపెట్టేందుకు షిమ్మర్‌ని వాడుతుంటారు. కానీ దానివల్ల అవి మరింత స్పష్టంగా కనిపిస్తాయి. బదులుగా మ్యాటీ పౌడర్‌ వాడితే. అలంకరణ సహజంగా కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్