చీర కట్టి.. రికార్డులు కొడుతోంది

సంప్రదాయ, ఆధునిక వేడుకేదైనా మన మనసు చీర మీదకే మళ్లుతుంది. సందర్భానికి తగ్గట్టుగా కొన్నిసార్లు వైవిధ్యంగానూ కడుతుంటాం. కానీ బెంగళూరుకి చెందిన దుర్గను కదిలించండి.. ఒక చీరను ఒకటి కాదు.. రెండుకాదు నూట యాభైకి పైగా రకాలుగా కట్టొచ్చని చెబుతుంది. అలా కట్టి రికార్డులనూ సొంతం చేసుకుంది.

Updated : 04 Nov 2021 06:21 IST

సంప్రదాయ, ఆధునిక వేడుకేదైనా మన మనసు చీర మీదకే మళ్లుతుంది. సందర్భానికి తగ్గట్టుగా కొన్నిసార్లు వైవిధ్యంగానూ కడుతుంటాం. కానీ బెంగళూరుకి చెందిన దుర్గను కదిలించండి.. ఒక చీరను ఒకటి కాదు.. రెండుకాదు నూట యాభైకి పైగా రకాలుగా కట్టొచ్చని చెబుతుంది. అలా కట్టి రికార్డులనూ సొంతం చేసుకుంది.

దుర్గా వెంకటేష్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌. ఇంటర్నేషనల్‌ సర్టిఫైడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌. ఈమెకి చిన్నప్పటి నుంచీ ఫ్యాషన్‌ రంగమంటే ఆసక్తి. దీన్నే కెరియర్‌గా ఎంచుకోవాలని సంబంధిత కోర్సులూ పూర్తిచేసింది. బెంగళూరులో తన పేరిటే సొంతంగా సెలూన్‌ అండ్‌ అకాడమీ ప్రారంభించి గుర్తింపూ తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి వేడుక ఏదైనా అమ్మ చీర చుట్టేసేది. అదే వివిధ చీరలు కట్టడంపై ప్రయోగాలు చేసేలా చేసింది. అలా 135 రకాలుగా కట్టడం కనిపెట్టింది.

దీంతోనే ఎందుకు గుర్తింపు తెచ్చుకోకూడదు అనుకుంది. వేగంగా కట్టడంపై సాధన చేసింది. 2019లో గంటకు 83 విధాలుగా కట్టి ఇండియా, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డులను సొంతం చేసుకుంది. గత ఏడాది రెండు గంటల పదిహేను నిమిషాల్లో 135 స్టైల్స్‌ ప్రయత్నించి ఆసియన్‌, బ్రిటిష్‌ వరల్డ్‌ రికార్డులను సొంతం చేసుకుంది. ఈ ఏడాది అదే సమయంలో 155 విధాలుగా చీరను కట్టి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులకెక్కింది. 2019లో మిసెస్‌ సౌత్‌ ఇండియా యూనివర్స్‌ విజేతగా నిలిచిన ఈమె తోటి మహిళలకు చేయూతనివ్వడం తన బాధ్యత అంటోంది.
‘పెళ్లయ్యాక ఆడవాళ్లు కెరియర్‌ను పక్కన పెట్టేస్తారు. బాధ్యతలు, పిల్లల పెంపకంతో పూర్తి సమయం కేటాయించే వీలూ ఉండదు. అలాంటి వాళ్లకి ప్రోత్సాహమివ్వడానికి శిక్షణనిస్తుంటా. పని అవకాశమూ కల్పిస్తున్నా. పేద మహిళలు ఎవరిమీదా ఆధారపడకుండా వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి ఆర్థిక ఆసరా పొందేలా చూడటమే దీని వెనకున్న ఉద్దేశం’ అంటోంది దుర్గ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్