ముంజేతులు మృదువుగా...

మాధురి ముంజేతుల అందమంతా శీతకాలం వచ్చేసరికి మాయమవుతుంది. పొడారిపోయి, చేతులపై చర్మమంతా వడలిపోయినట్లుగా మారిపోతుంది. చేతులకు పూర్వపు మృదుత్వాన్ని తిరిగి తేవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు చర్మ నిపుణులు.

Updated : 07 Nov 2021 04:44 IST

మాధురి ముంజేతుల అందమంతా శీతకాలం వచ్చేసరికి మాయమవుతుంది. పొడారిపోయి, చేతులపై చర్మమంతా వడలిపోయినట్లుగా మారిపోతుంది. చేతులకు పూర్వపు మృదుత్వాన్ని తిరిగి తేవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు చర్మ నిపుణులు.

* మూడు పద్ధతులతో.. సబ్బు శానిటైజర్‌ వంటివాటి వల్ల చర్మం పొడారి, బీటలు వారినట్లుగా మారుతుంది. దీంతోపాటు చలొకటి. ఇలా జరగొద్దంటే క్లెన్సింగ్‌, టోనింగ్‌, మాయిశ్చరైజింగ్‌ విధానాలను చేతులకూ పాటించాలి.

* ఎలర్జీలకు దూరంగా... రసాయనాల్లేని యాంటీ బ్యాక్టీరియల్‌ ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలి. దేన్నైనా శుభ్రపరిచినా, బయటకు వెళ్లొచ్చినా చేతులను కడుక్కోవాలి. దీంతో ఎలర్జీలు రావు. వారానికి 2, 3 సార్లు తేనె, చక్కెర మిశ్రమంతో ముంజేతులను మృదువుగా స్క్రబ్బింగ్‌ చేసుకోవాలి. దీంతో మృతకణాలు తొలిగి చర్మం మృదువుగా మారుతుంది. ముఖానికి, మెడకే కాదు, చేతులకూ సన్‌స్క్రీన్‌ రాయాలి. అలాగే చేతులను సబ్బుతో కడిగిన ప్రతిసారీ మాయిశ్చరైజర్‌ తప్పనిసరి.

* లేపనాలతో.. ఒక బౌల్‌లో కోడిగుడ్డు తెల్లసొనలో చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముంజేతులకు లేపనంలా రాసి పావుగంట సేపు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. తడి ఆరిన తర్వాత మాయిశ్చరైజర్‌తో మృదువుగా మర్దన చేయాలి.  రెండు చెంచాల సెనగ పిండిలో చెంచా చొప్పున పసుపు, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని లేపనంగా రాసి ఆరనిచ్చి, కడిగినా ప్రయోజనం ఉంటుంది. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు చేతులకు గోరువెచ్చని కొబ్బరినూనెను రాస్తే చాలు. ఉదయానికి చర్మం మృదువుగా మారుతుంది. రోజూ ఉదయం పచ్చిపాలను చేతులకు అప్లై చేస్తే మెరుపులీనుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్