మొటిమలు తగ్గించే బొప్పాయి...

ముఖంపై మొటిమలు చాలామందిలో కనిపిస్తుంటాయి. ఇదో పెద్ద సమస్యగా భావించే వారు...బొప్పాయితో ఈ చిన్న చిట్కాలు పాటించి చూడండి.బొప్పాయి గుజ్జు, టొమాటో రసాన్ని సమపాళ్లలో తీసుకోండి. అందులో చెంచా పాలు, కాస్త తేనె కలిపి ముఖమంతా రాయండి. పదినిమిషాల

Published : 08 Nov 2021 00:37 IST

ముఖంపై మొటిమలు చాలామందిలో కనిపిస్తుంటాయి. ఇదో పెద్ద సమస్యగా భావించే వారు...బొప్పాయితో ఈ చిన్న చిట్కాలు పాటించి చూడండి.

* బొప్పాయి గుజ్జు, టొమాటో రసాన్ని సమపాళ్లలో తీసుకోండి. అందులో చెంచా పాలు, కాస్త తేనె కలిపి ముఖమంతా రాయండి. పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే సరి. ఇలా కనీసం రెండు రోజులకోసారైనా చేస్తుంటే క్రమంగా సమస్య దూరమవుతుంది.

* కళ్లకింద చారలు, మొటిమల తాలూకు మచ్చలు కనిపిస్తుంటే...బొప్పాయి గుజ్జులో కాస్త ఆముదం కలిపి మృదువుగా కళ్లకింద, చెంపలు, నుదురు వంటి చోట్ల రాయండి. చారలు తగ్గుతాయి. వన్నె పెరుగుతుంది.

* వాడేసిన గ్రీన్‌టీ బ్యాగుని ఫ్రిజ్‌లో పెట్టి...ఆపై దాన్ని పడుకునే ముందు మూసిన కనురెప్పలపై ఉంచండి. ఇలా పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచి ఆపై కడిగేసుకుంటే సరి. క్రమంగా మీరు కోరుకున్న మార్పు వస్తుంది. కళ్లకు తగిన విశ్రాంతి లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్