ట్యాన్‌ తగ్గించే కలబంద!

చర్మ సంరక్షణకు  సహజ సిద్ధ ఉత్పత్తులే మంచివి. వాటిల్లో కలబంద ఒకటి. మేను సొగసుకీ, మెరుపునకీ... ఇందులోని పోషకాలే మూలం. దీన్ని ఎలా వాడాలంటే!

Updated : 11 Nov 2021 06:17 IST

చర్మ సంరక్షణకు  సహజ సిద్ధ ఉత్పత్తులే మంచివి. వాటిల్లో కలబంద ఒకటి. మేను సొగసుకీ, మెరుపునకీ... ఇందులోని పోషకాలే మూలం. దీన్ని ఎలా వాడాలంటే!
కప్పు కలబందగుజ్జులో కొద్దిగా రోజ్‌ వాటర్‌, చెంచా తేనె.. కాస్త సెనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే మెరిసిపోతారు.
* కలబంద గుజ్జులో కాస్త ఆలివ్‌ ఆయిల్‌, రెండు చెంచాల ముల్తానీ మట్టి వేసి పేస్ట్‌లా చేసి ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేస్తే జిడ్డు తగ్గి మోము కాంతులీనుతుంది.
* పావుకప్పు కలబంద గుజ్జులో అరచెక్క నిమ్మరసం, తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌ ప్యాక్‌లా వేసి పదినిమిషాలాగి కడిగేసుకోవాలి. దీనివల్ల కేవలం ట్యాన్‌ మాత్రమే కాదు.. మొటిమలు కూడా తగ్గుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్