Published : 17/11/2021 02:05 IST

పదే పదే స్క్రబ్‌ వాడితే!

మొటిమలు, మృతకణాలు... ముఖం మీద కనిపిస్తే చాలు. ‘కాస్త స్క్రబ్‌ చేయకూడదూ’ అని సలహా ఇస్తుంటారు కొందరు. ఒకప్పటి నలుగైతే ఫరవాలేదు కానీ... ఇప్పుడు అన్నీ రసాయన ఉత్పత్తులే. రుద్దడానికి రాళ్లు, పీచులూ కూడా వాడుతున్నారు.  

ఫేస్‌వాష్‌ వాడితే ఇబ్బంది లేదు కానీ సబ్బులు వాడుతుంటే నేరుగా ముఖం మీద రుద్దకూడదు. చేతులకు రుద్దుకుని ఆ నురుగునే వాడాలి. అది కూడా సున్నితంగా!

ముఖానికి స్క్రబ్బింగ్‌ అంటే... బరబరా తోమేయడం అనుకోవద్దు. ఇందుకోసం పీచు, ఇతరత్రా వాడేప్పుడు అవి చర్మానికి చేసే హాని ఏంటో కూడా తెలుసుకోండి. మునివేళ్లతోనే ఆ పని నెమ్మదిగా ఓ క్రమపద్ధతిలో చేయాలి. అప్పుడే రక్తప్రసరణ సక్రమంగా జరిగి చర్మగ్రంథులు తెరుచుకుని శుభ్రపడతాయి.

కొందరు చర్మం ఆరోగ్యంగా కనిపించాలని రకరకాల స్క్రబ్బర్లను వినియోగిస్తుంటారు. వీటితో మృతకణాలు తొలగడం అలా ఉంచి చర్మ సున్నితత్వం దెబ్బ తింటుంది. సహజనూనెల్ని కోల్పోయి... నిగారింపు తగ్గుతుంది. ఒక్కోసారి దద్దుర్లు వంటి సమస్యలొచ్చే అవకాశమూ ఉంది. అందుకే వారానికి రెండు మూడు సార్లు స్క్రబ్‌ చేస్తే చాలు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని