ఆముదంతో అందంగా...

ఈ కాలంలో చర్మం ఎండిపోయి, నిర్జీవంగా మారుతుంది. పొడిబారిన జుట్టుతో చుండ్రు సమస్యలూ అధికమవుతాయి. వీటికి చెక్‌ పెట్టాలంటే ఆముదమే మందు..జుట్టుకు .. సమాన పరిమాణాల్లో కొబ్బరినూనె, ఆముదం వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే మాడుకు పట్టించాలి. పది నిమిషాలు మృదువుగా మర్దన చేయాలి.

Updated : 18 Nov 2021 06:08 IST

ఈ కాలంలో చర్మం ఎండిపోయి, నిర్జీవంగా మారుతుంది. పొడిబారిన జుట్టుతో చుండ్రు సమస్యలూ అధికమవుతాయి. వీటికి చెక్‌ పెట్టాలంటే ఆముదమే మందు..

జుట్టుకు .. సమాన పరిమాణాల్లో కొబ్బరినూనె, ఆముదం వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే మాడుకు పట్టించాలి. పది నిమిషాలు మృదువుగా మర్దన చేయాలి. గంట తర్వాత కడిగేస్తే సరి. ఇది జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తుంది. జుట్టూ ఒత్తుగా, పొడవుగా పెరగడంతోపాటు మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది.

కాళ్లు, చేతులు.. ఈ కాలంలో కాళ్లు, చేతులకు ఆముదాన్ని పట్టిస్తే మృదువుగా మారతాయి. ఇది చర్మంలోకి ఇంకిపోయి పోషణ, తేమను అందిస్తుంది.

కనుబొమలు ఒత్తుగా.. నిద్రపోయే ముందు గోరువెచ్చని ఆముదాన్ని కనురెప్పలు, కనుబొమలపై రాసి మృదువుగా మర్దన చేయాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే మార్పు మీకే కనిపిస్తుంది.

మృదువైన అధరాల కోసం.. ఈ కాలంలో పెదాలు పొడిబారడం, పగలడం సహజమే. రెండు, మూడు చుక్కల నూనెను పెదాలపై వేసి కాసేపు మర్దనా చేయాలి. ఇలా చేస్తే అధరాలు మృదువుగా మారతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్