పొట్ట కనిపించకుండా..

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొందరికి ఏ దుస్తులు వేసుకోవాలన్నా... పొట్ట కనిపిస్తుందనే బాధ. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సరి. మీరు జీన్స్‌ వాడితే హైవెయిస్ట్‌ రకాన్ని ఎంచుకోండి. ఎక్కువ కుచ్చిళ్లు ఉన్న లెహెంగాలకు బదులు బాక్స్‌ ప్లీటెడ్‌ తరహావి వేసుకుంటే మీ సమస్య కనిపించదు....

Updated : 20 Nov 2021 12:51 IST

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొందరికి ఏ దుస్తులు వేసుకోవాలన్నా... పొట్ట కనిపిస్తుందనే బాధ. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సరి.

మీరు జీన్స్‌ వాడితే హైవెయిస్ట్‌ రకాన్ని ఎంచుకోండి. ఎక్కువ కుచ్చిళ్లు ఉన్న లెహెంగాలకు బదులు బాక్స్‌ ప్లీటెడ్‌ తరహావి వేసుకుంటే మీ సమస్య కనిపించదు.

నిలువు గీతలున్న డ్రెస్‌లు పొట్ట కనిపించనివ్వవు సరికదా...పొడవుగానూ కనిపించేలా చేస్తాయి. ఆర్గాంజా, బెనారస్‌ వంటివాటికి బదులు షిఫాన్‌, జార్జెట్‌, హ్యాండ్‌లూమ్‌ రకాలు బాగా నప్పుతాయి. అయితే ఏ లైన్‌, కలీ డిజైన్లలో కుర్తాల ఎంపిక మేలు.

పొడుగాటి మ్యాక్సీ డ్రెస్‌ ఎంచుకుంటున్నా, పలాజో వేసుకుంటున్నా ఓ బెల్టుపెట్టుకోవడం మంచిది. అయితే బెల్టులు సన్నగా ఉండేలా చూసుకోండి. రాప్‌ టాప్‌లు బాగుంటాయి. స్టేట్‌మెంట్‌ జ్యుయలరీ అంటే పెద్ద చెవి పోగులు, నెక్లెస్‌ వంటివి ధరిస్తే చాలు. అవి ఎదుటివారి దృష్టిని ఆకర్షించి...పొట్ట కనిపించకుండా...చేస్తాయి. ట్రెండీ లుక్‌తో ఆకట్టుకోగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్