Updated : 21/11/2021 05:35 IST

మృదువైన అధరాలకు...

శీతాకాలం మొదలైంది. ఈ సీజన్‌ ప్రభావానికి పెదాలు పొడారి, పగిలి పోయినట్లుగా మారతాయి. ఇలాంటప్పుడు ఇంట్లోనే సహజసిద్ధమైన పదార్థాలతో మృదువుగా మార్చుకోవచ్చు..

ముందుగా ఒకటిన్నర చెంచా బీ వ్యాక్స్‌ను గాజుగిన్నెలోకి తీసుకుని డబుల్‌ బాయిలర్‌ పద్ధతిలో కరిగించాలి. ఇందులో చెంచా షియాబటర్‌ వేసి కలిపి, ఆ తర్వాత చెంచా కొబ్బరినూనె వేయాలి. మరోసారి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పొయ్యిపై నుంచి దించి ఆరనివ్వాలి. ఈ ఆరిన దాంట్లో అయిదు చుక్కల విటమిన్‌ ఈ, ఏడు చుక్కల లావెండర్‌ ఎసెన్షియల్‌ నూనె వేసి కలుపుతూ చిక్కగా అయిన తర్వాత అందులో చెంచా బ్రౌన్‌ షుగర్‌ వేయాలి. ఈ మిశ్రమాన్ని లిప్‌స్టిక్‌ కంటైనర్‌లో నింపి ఫ్రిజ్‌లో ఉంచితే చాలు. పెదాలు పొడారినట్లు అనిపించినప్పుడు పెదాలపై మృదువుగా క్రీంలా ఉన్న ఈ మిశ్రమాన్ని రుద్దాలి. అధరాలకు ఇది మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఆ తర్వాత టిష్యూ పేపర్‌తో పెదవులపై పేరుకున్న మృతకణాలను తొలగించేలా తుడిచి, నీటితో కడిగితే చాలు. అధరాలు మృదువుగా మారతాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని