మృదువైన శిరోజాలకు మయోనైజ్‌..

థిక్‌ కోల్డ్‌సాస్‌లా ఉండే మయోనైజ్‌ను స్నాక్స్‌కు తోడుగా తినడానికి చాలా మంది ఇష్టపడతారు. గుడ్డు, నిమ్మరసం, న్యూట్రల్‌ ఫ్లేవర్‌ ఆయిల్‌తో చేసే మయోనైజ్‌ జుట్టుకూ మంచిది అంటున్నారు

Updated : 23 Nov 2021 05:48 IST

థిక్‌ కోల్డ్‌సాస్‌లా ఉండే మయోనైజ్‌ను స్నాక్స్‌కు తోడుగా తినడానికి చాలా మంది ఇష్టపడతారు. గుడ్డు, నిమ్మరసం, న్యూట్రల్‌ ఫ్లేవర్‌ ఆయిల్‌తో చేసే మయోనైజ్‌ జుట్టుకూ మంచిది అంటున్నారు సౌందర్య నిపుణులు. దాంతో ఏం చేయాలంటే...

రెండు చెంచాల మయోనైజ్‌, నాలుగైదుచుక్కల బాదం నూనె, గుడ్డు ఉంటే చాలు. శిరోజాలను మృదువుగా, ఒత్తుగా మార్చుకోవచ్చు. ముందుగా మయోనైజ్‌ను గిన్నెలోకి తీసుకోవాలి. అందులో గుడ్డు కొట్టి, తెల్ల సొన మాత్రమే జాగ్రత్తగా పడేలా చూడాలి. ఆ తర్వాత బాదంనూనెను కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి శిరోజాల చివర్ల వరకు లేపనంలా పట్టించాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి రసాయన రహిత షాంపూతో బాగా రుద్ది, గోరువెచ్చని నీటితో తలను శుభ్రం చేయాలి. వారానికొకసారి ఇలా చేస్తే చాలు. శిరోజాలు పెరగడమే కాదు, రాలే సమస్యకు దూరంకావొచ్చు. మృదువైన జుట్టు మీ సొంతమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్