సహజ ఉత్పత్తులకే నయన్‌ ఓటు

మూడు పదులు నిండినా చెక్కు చెదరని అందం నయనతార సొంతం. తన చర్మ, శిరోజాల సంరక్షణ గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘సూర్యకిరణాలకు చర్మం పాడవకుండా సన్‌స్క్రీన్‌ను తప్పక వాడతా. నా బ్యాగులో ఇది లేకుండా అడుగు బయట పెట్టను. రసాయనరహిత, సహజసిద్ధలేపనాలకే ప్రాధాన్యమిస్తా. చర్మం మెరిసేలా, మొటిమలు...

Updated : 24 Nov 2021 05:26 IST

మూడు పదులు నిండినా చెక్కు చెదరని అందం నయనతార సొంతం. తన చర్మ, శిరోజాల సంరక్షణ గురించి ఇలా చెప్పుకొచ్చింది.

‘సూర్యకిరణాలకు చర్మం పాడవకుండా సన్‌స్క్రీన్‌ను తప్పక వాడతా. నా బ్యాగులో ఇది లేకుండా అడుగు బయట పెట్టను. రసాయనరహిత, సహజసిద్ధలేపనాలకే ప్రాధాన్యమిస్తా. చర్మం మెరిసేలా, మొటిమలు రాకుండా ఇవే కాపాడుతుంటాయి. దాహం వేసినా వేయకపోయినా ప్రతిరెండు గంటలకోసారి నీళ్లు తాగుతుంటా. అంతేకాదు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నర్‌... దేంతోనైనా ఏదైనా తాజా పండ్ల రసం ఉండాల్సిందే. షూటింగ్‌ బ్రేక్స్‌లోనూ పండ్లరసాన్నే తీసుకుంటా. కాఫీ, టీ, శీతలపానీయాలకు చాలా దూరం. రోజూ క్లెన్సింగ్‌, టోనింగ్‌, మాయిశ్చరైజింగ్‌ చేసుకోవడం మాత్రం తప్పనిసరి. ఇవన్నీ చర్మాన్ని తాజాగా, మృదువుగా ఉంచుతాయి. నిద్రపోయే ముందు మేకప్‌ను తప్పక తొలగించి మాయిశ్చరైజర్‌ రాస్తా. శిరోజాలనూ నిర్లక్ష్యం చేయను. సమయం దొరికినప్పుడల్లా స్వచ్ఛమైన కొబ్బరినూనెతో మర్దన చేస్తా. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచి మృదువుగా మారుస్తుంది. అప్పుడప్పుడు తేలికైన ప్యాక్స్‌ వేస్తుంటా. దీంతో కేశాలు రాలవు, మెత్తగా పట్టుకుచ్చులా మెరుస్తుంటాయి’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్