వైట్‌హెడ్స్‌ వదలవా?

కొందరికి వైట్‌హెడ్స్‌ బెడద కాలంతో నిమిత్తం లేకుండా వెంటాడుతూనే ఉంటుంది. వీటిని తగ్గించడానికి, అసలు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి?

Updated : 25 Nov 2021 06:01 IST

కొందరికి వైట్‌హెడ్స్‌ బెడద కాలంతో నిమిత్తం లేకుండా వెంటాడుతూనే ఉంటుంది. వీటిని తగ్గించడానికి, అసలు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి?

చర్మం శుభ్రంగా ఉంచుకుంటే ఈ సమస్య బాధించదు. కాబట్టి, చలికి వెరవకుండా రోజుకు రెండుసార్లు తప్పక క్లెన్సింగ్‌ చేసుకోవాలి. తక్కువ గాఢత ఉండే ఉత్పత్తులనే వాడాలి. మరీ ఎక్కువ వేడిని కాకుండా గోరువెచ్చని నీటినే స్నానానికి ఉపయోగించాలి.
మృతకణాలు, వైట్‌హెడ్స్‌ను తొలగించుకోవడానికి స్క్రబ్‌ మంచి పరిష్కారమే! వారానికి రెండుసార్లు తప్పక చేస్తే ఫలితముంటుంది. మరీ బరకగా ఉండేవి మాత్రం ఎంచుకోవద్దు.
బయటికి వెళ్లే ప్రతిసారీ సన్‌స్క్రీన్‌ లోషన్‌ తప్పనిసరి. దీనికీ వైట్‌హెడ్స్‌కీ ఏంటీ సంబంధం అనుకోవద్దు. సన్‌స్క్రీన్‌ వీటికి నిరోధకంగా పని చేస్తుందట.
కేశాల సంరక్షణకు ఉపయోగించే ప్రొడక్ట్స్‌ ముఖంపై పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇవీ వైట్‌హెడ్స్‌కు కారణమవుతాయంటున్నారు నిపుణులు. మొబైల్‌, దిండ్లు, సన్‌గ్లాసెస్‌.... తరచూ వాడే ఇలాంటి వస్తువులపై నూనె, దుమ్ము, బ్యాక్టీరియా చేరిపోతుంది. కాబట్టి వీటినీ ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.  మేకప్‌ అలవాటున్న వారు.. ఆయిల్‌ ఫ్రీ సౌందర్య ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలి. వాడిన ప్రతిసారీ మేకప్‌ సామాగ్రిని శుభ్రం చేయాలి. వాటిని ఇతరులతో పంచుకోవద్దు. అలాగే పడుకునే ముందు మేకప్‌ను తప్పక తొలగించుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తుంటే వైట్‌హెడ్స్‌కు దూరంగా ఉండొచ్చు.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని