ఒక్కరాత్రిలో అందమైన ఫలితం

ఈ కాలం చర్మం పొడి బారకుండా చాలామంది కొబ్బరినూనె పట్టిస్తుంటారు. ఒక్కరాత్రిలోనే ఫలితం ఇస్తుందని దీనికి పేరు. దీంతో అలాంటి త్వరిత ఫలితమే ఇంకొన్నింటి విషయంలోనూ పొందొచ్చు. అవేంటంటే...ముఖానికి మరింత అందాన్నిచ్చేది చిరునవ్వే. మెరిసే దంతాలున్నప్పుడే సహజంగా నవ్వగలుగుతాం.

Updated : 26 Nov 2021 05:16 IST

ఈ కాలం చర్మం పొడి బారకుండా చాలామంది కొబ్బరినూనె పట్టిస్తుంటారు. ఒక్కరాత్రిలోనే ఫలితం ఇస్తుందని దీనికి పేరు. దీంతో అలాంటి త్వరిత ఫలితమే ఇంకొన్నింటి విషయంలోనూ పొందొచ్చు. అవేంటంటే...

ముఖానికి మరింత అందాన్నిచ్చేది చిరునవ్వే. మెరిసే దంతాలున్నప్పుడే సహజంగా నవ్వగలుగుతాం. అవి సొంతమవ్వాలంటే రాత్రి పడుకునే ముందు పళ్లకు కొబ్బరినూనె పూయండి. మరుసటి రోజు ఎప్పటిలాగే బ్రష్‌ చేస్తే సరి. తెల్లటి దంతాలు మీ సొంతమవుతాయి.

* కొందరిలో గోళ్లు మెరుపు కోల్పోయి, నిర్జీవంగా ఉంటాయి. త్వరగా విరిగిపోతుంటాయి కూడా. అలాంటి వాళ్లు గోరువెచ్చని కొబ్బరి నూనెను గోళ్లకు పట్టించి, మృదువుగా మర్దనా చేయాలి. చేతులకూ పట్టిస్తే మృదువుగా అవడంతోపాటు మెరుస్తాయి కూడా.

* ఒత్తైన కనుబొమ్మలు, పొడవైన కనురెప్పలు కావాలంటే రోజూ రాత్రి కొబ్బరి నూనె, పెప్పర్‌ మింట్‌ ఆయిల్‌ కొన్ని చుక్కల చొప్పున కలిపి పట్టించండి.

* మనలో చాలామందికి పాదాల పగుళ్లు పెద్ద సమస్య. మీకూ ఉంటే... పడుకునే ముందు సమస్య ఉన్న చోట కొబ్బరి నూనె రాయండి. ఇది పాదాలను హైడ్రేట్‌ చేయడమే కాకుండా మృదువుగానూ మారుస్తుంది. పాచినట్లుగా అనిపిస్తే నూనెకు పసుపును చేరిస్తే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్