Updated : 27/11/2021 05:38 IST

తల దాల్చిన చెక్క!

సీజన్‌, ప్రాంతం.. ఇలా ఏది మారినా దాని ప్రభావం పడేది జుట్టుపైనే! ఇది ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పూతలు తప్పనిసరి అంటున్నారు సౌందర్య నిపుణులు.

గ్రీన్‌టీ: రెండు చెంచాల గ్రీన్‌టీలో గుడ్డులోని పచ్చ సొన వేసి క్రీంలా అయ్యేలా కలపాలి. ఆపై మాడు నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించి ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో కడిగేయాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శిరోజాలను రాలనివ్వకుండా పరిరక్షించడమే కాకుండా ఫ్రీరాడికల్స్‌తో పోరాడటానికీ తోడ్పడతాయి.

దాల్చినచెక్క: నాలుగు చెంచాల దాల్చినచెక్క పొడికి చెంచా చొప్పున తేనె, కొబ్బరినూనె కలిపి మాడుకు మృదువుగా మర్దనా చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చాలు. చర్మ రంధ్రాల్లో రక్తప్రసరణ బాగా జరిగి, జుట్టు రాలకుండా చేస్తుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచీ  కూడా రక్షిస్తుంది.

గుడ్డు: రెండు కప్పుల పాలకు ఒక గుడ్డు సొన, రెండు చెంచాల చొప్పున నిమ్మరసం, ఆలివ్‌ నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంట ఆగి గాఢత తక్కువగా ఉన్న షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌లో పుష్కలంగా ఉండే ప్రొటీన్లు, సి విటమిన్‌ శిరోజాలను ఆరోగ్యంగా పెరిగేలా చేసి, వాతావరణ దుష్ప్రభావాలు పడకుండా కాపాడతాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని