ఈ జీన్స్‌ పర్యావరణానికి మంచివి..
close
Published : 28/11/2021 01:29 IST

ఈ జీన్స్‌ పర్యావరణానికి మంచివి..

మార్కెట్లోకి కొత్త ఫ్యాషన్లు రాగానే వాటిని అనుసరించాలనుకుంటాం. కొత్తవి కొనుక్కుని, పాతవి వదిలించుకుంటాం. ఈక్రమంలో పర్యావరణానికి జరిగే హాని గురించి మాత్రం ఆలోచించం. మన దుస్తులకీ, పర్యావరణానికీ ఏంటి సంబంధం అని అనుకోవచ్చు. దుస్తుల తయారీకి వాడే పత్తిని పండించడానికి ఎంత నీరు అవసరం అవుతుంది? మనం వాడి పారేసిన దుస్తులు భూమిలో కలవడానికి పట్టే సమయం ఎంత? దుస్తుల తయారీలో ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాల సంగతేంటి? ‘ఇవన్నీ ఆలోచించే ఇరవై ఏడేళ్ల లోపు వారి కోసం ప్రత్యేకమైన సర్య్కులర్‌ ఫ్యాషన్‌ ప్రవేశ పెట్టాం’ అంటోంది అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్‌ ప్రిమార్క్‌ డైరెక్టర్‌ లియానే వాకర్‌. ‘సర్య్కులర్‌ ఫ్యాషన్‌ అంటే ఫ్యాషన్‌ కారణంగా విడుదలయ్యే వ్యర్థాలని తగ్గించుకుంటూ.. రీసైక్లింగ్‌ దుస్తులకు ప్రాధాన్యతనివ్వడం. జీన్స్‌ రీడిజైన్‌ పేరుతో మేమొక కలెక్షన్‌ని ప్రవేశపెట్టాం. ఈ జీన్స్‌ 70శాతం ఆర్గానిక్‌ కాటన్‌తో తయారయ్యాయి. 20 శాతం రీసైక్లింగ్‌ కాటన్‌తో తయారయ్యాయి. రివిట్స్‌ వంటివి వాడకుండా జాగ్రత్తపడ్డాం’ అంటోంది లియానే. ఈ ఆలోచనని స్ఫూర్తిగా తీసుకుని ఫ్యాషన్లలో రీసైక్లింగ్‌కి ప్రాధాన్యమిస్తే బాగుంటుంది కదూ.


Advertisement

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని