శృతి రహస్యమిదీ
close
Published : 28/11/2021 01:29 IST

శృతి రహస్యమిదీ!

వంట గదిలో దొరికే వాటితోనే ముఖాన్ని మెరిపించేయొచ్చంటోంది అందాల తార శృతిహాసన్‌. అందుకు తనేం చేస్తుందో చెప్పకొచ్చిందిలా... ‘వంటసోడాకు కొబ్బరినూనె కలిపి రెండుమూడు రోజులకోసారి ముఖానికి స్క్రబ్‌ చేస్తా. అప్పటికప్పుడు వేడుకకి వెళ్లాల్సొస్తే పెరుగు, తేనె సమాన పరిమాణంలో కలిపి ముఖానికి పట్టించి, ఓ పావుగంట ఆగి కడిగేస్తే మెరిసిపోతాం. రెండు స్ట్రాబెర్రీలను మెత్తగా చేసి, రెండు చెంచాల తేనె కలిపి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత కడిగినా ముఖం మెరుపులీనుతుంది. మజ్జిగలో టొమాటో రసం కలిపి రాస్తే ఎండవల్ల కలిగే మచ్చలను దూరం చేసి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. గుడ్డు తెల్ల సొనకు చెంచా బాదం నూనె కలిపి ముఖానికి మర్దనా చేసి చూడండి. చెంచా మిల్క్‌క్రీంకు సమానంగా కలబంద గుజ్జు, పావుచెంచా పసుపు కలిపి లేపనంలా వేసుకుంటే సరి. ఏ లేపనం వేసుకున్నా ముందు ముఖాన్ని మురికి లేకుండా శుభ్రం చేసుకోవాలి’ అంటోంది.


Advertisement

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని