పిగ్మెంటేషన్‌కు ఇంటి చికిత్స
close
Updated : 30/11/2021 06:07 IST

పిగ్మెంటేషన్‌కు ఇంటి చికిత్స!

అమ్మాయిల నుంచి నడి వయసు వాళ్ల వరకు పిగ్మెంటేషన్‌ పెద్ద సమస్యే. మెలనిన్‌ లోపం, ఎండలో ఎక్కువగా తిరగడం, ప్రసవం.. ఇలా దీనికి బోలెడు కారణాలు. దానికి ఇంట్లోనే చెక్‌ పెట్టేయొచ్చని తెలుసా?

ఉల్లి.. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్న దీని రసాన్ని ఈ మచ్చలపై రాసి పావు గంటసేపు ఆరనిచ్చి కడిగేయాలి. ఇలా రోజుకి రెండు సార్లు చేస్తే చర్మం పూర్వస్థితికి చేరుకుంటుంది.

యాపిల్‌సిడార్‌ వెనిగర్‌.. దీనికి సమపాళ్లలో నీటిని కలిపి మచ్చలున్న చోట రాయాలి. రెండు, మూడు నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా కొన్నిరోజులు చేస్తే ఫలితం ఉంటుంది. గ్రీన్‌టీ ప్యాకెట్‌ను మచ్చలపై మృదువుగా రోజూ అయిదు నిమిషాలు రుద్దినా చాలు.

పాలు, టొమాటో.. పచ్చిపాలల్లో ముంచిన దూదిని మచ్చలపై రుద్దండి. దీనిలోని లాక్టిక్‌ యాసిడ్‌ ఈ సమస్యకు మంచి మందు. టొమాటోలోని లైకోపిన్‌ కూడా చర్మంపై మచ్చలను పోగొట్టి మెరిసేలా చేస్తుంది. రోజుకి రెండు సార్లు రాస్తే చాలు.

ఎర్ర కందిపప్పు.. నాలుగు చెంచాల కందిపప్పును నీటిలో ఎనిమిది గంటలు నానబెట్టి, పేస్టులా చేసి ముఖానికి లేపనంలా రాయాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేయాలి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు పిగ్మెంటేషన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి.

కలబంద.. నానోటాక్సిక్‌ హైపర్‌ పిగ్మెంటేషన్‌ చికిత్సలో కలబందను వినియోగిస్తారు. నిద్రపోయే ముందు కలబంద గుజ్జును సమస్య ఉన్న చోట రాయాలి. ఉదయం గోరు వెచ్చని నీటితో కడిగేస్తే సరి.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని