Updated : 13/05/2022 15:56 IST

ఆధునిక అమ్మాయిలకు అదిరే మువ్వలు

పట్టీలంటే.. ఘల్లు ఘల్లుమనడం పాత ట్రెండ్‌. కాలంతో పోటీపడే నేటి అమ్మాయిలకు అవి నప్పడం లేదు. అలాగని కాళ్లని బోసిగా వదిలేస్తామా! అనుకునేవాళ్ల కోసమే రూపొందాయివి. సీతాకోకచిలుకలు, ముచ్చటైన ముత్యాలు, చిట్టి పక్షులు, స్మైలీ ఎమోజీలను సన్నటి చెయిన్లకు జోడించేశారిలా. నయా ట్రెండ్‌కు తగ్గట్టుగా... నవతరం మెచ్చేలా బాగున్నాయి కదూ! బంగారం, వెండి, రోజ్‌గోల్డ్‌ వంటి భిన్న లోహాలతోనూ ప్రయత్నిస్తున్నారు. ఆధునిక వస్త్రాలకూ మంచి జోడీ. నచ్చాయా మరి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని