అందానికి వేప!

ఈ కాలంలో చాలామందిని పొడిచర్మం, చుండ్రు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. వాటికి వేపతో చెక్‌ పెట్టేయండి! దాంతో మరిన్ని ప్రయోజనాలూ ఉన్నాయి.

Updated : 29 Feb 2024 16:23 IST

ఈ కాలంలో చాలామందిని పొడిచర్మం, చుండ్రు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. వాటికి వేపతో చెక్‌ పెట్టేయండి! దాంతో మరిన్ని ప్రయోజనాలూ ఉన్నాయి.

వేపలోని విటమిన్‌-ఎ, సి, కెరొటినాయిడ్స్‌, లినోలియిక్‌, ఒలియిక్‌ లాంటి సమ్మేళనాలు చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తాయి.

మొటిమలు, మచ్చలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నిరోధిస్తాయి. వేపాకుల పేస్ట్‌, పసుపు, కొబ్బరి నూనె కలిపి ముఖానికి పూత వేసుకుని పావుగంటాగి చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే చర్మానికి కావాల్సిన తేమ అందుతుంది. వేపలోని గుణాలు ఎక్స్‌ఫోలియేట్‌లా పనిచేసి చర్మరంధ్రాల్లోని మురికిని పోగొడతాయి.

యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బయోటిక్‌, యాంటీ ఆక్సిడెంట్‌ సమ్మేళనాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. యాంటీ ఫంగల్‌ సమ్మేళనాలు చుండ్రుతోపాటు దానివల్ల కలిగే దురద, మంట, ఫంగల్‌ సమస్యలనూ అరి కడతాయి. హార్మోన్ల అసమతౌల్యం, ఎండ, ఒత్తిడి... లాంటి కారణాల వల్ల జుట్టు త్వరగా నెరుస్తుంది. వేపలోని యాంటీ ఆక్సిడెంట్లు ఈ సమస్యనూ నిరోధిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్