మృదువైన పాదాలు కావాలా
close
Updated : 04/12/2021 06:23 IST

మృదువైన పాదాలు కావాలా!చలికాలంలో చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య పాదాల పగుళ్లు. కొందరిలో ఇవి తీవ్రంగా ఉండి, అడుగే వేయలేని స్థితి కనిపిస్తుంటుంది. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు..

పాదాల పగుళ్లకి ముఖ్య కారణం మురికి చేరడంతోపాటు పొడి బారడమే. కాబట్టి, రోజూ పాదాలను శుభ్రంగా కడిగి, మృదువైన వస్త్రంతో తుడిచి మాయిశ్చరైజర్‌ రాయాలి. టబ్‌లో పాదాలు మునిగేలా గోరు వెచ్చని నీటితో నింపి, రెండు చెంచాల తేనె వేసి పాదాలను ఉంచాలి. పది నిమిషాలయ్యాక పగిలిన ప్రాంతాన్ని మృదువుగా రుద్దాలి. ఇది సహజసిద్ధ మాయిశ్చరైజర్‌లా పని చేయడమే కాదు, బ్యాక్టీరియానూ దూరం చేస్తుంది.

* మర్దన.. కొబ్బరి నూనెలో పసుపు కలిపి పగుళ్లున్న చోట లేపనంలా రాయాలి. దీంతో వాపు, నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. రోజూ రాత్రి కొబ్బరినూనెతో మృదువుగా మర్దనా చేసినా ఫలితం ఉంటుంది. మర్దన తర్వాత కాటన్‌ సాక్సు వేసుకుంటే మృదువుగా మారతాయి. ఈ సీజన్‌లో బయటికి వెళ్లినప్పుడూ సాక్సు ధరిస్తే మంచిది.

* పాదరక్షలు.. మెత్తని, వదులైన వాటికే ప్రాధాన్యమివ్వాలి. హీల్స్‌ వంటివి పాదాలపై ఒత్తిడిని పెంచుతాయి. దానికి చలిగాలులు తోడైతే పగుళ్లు మొదలవుతాయి.

* క్రీం.. ఫుట్‌కేర్‌ క్రీం దొరుకుతోంది. సాల్‌ ట్రీ, మెంతులతో చేసినవి బాగా పనిచేస్తాయి. రోజుకి రెండుసార్లు రాస్తే సరి. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పాదాలను ఆరోగ్యంగా ఉంచి పగుళ్ల నుంచి కాపాడతాయి. కాళ్లు శుభ్రం చేసుకోవడానికీ గోరువెచ్చని నీటినే ఉపయోగించాలి.


Advertisement

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని