మాత్రతో.. మాస్క్‌

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు కొద్ది సమయంలో మెరిపించడానికి మాస్క్‌లు వేస్తుంటాం. సమయముంటే లేపనాలనూ, తక్కువ వ్యవధికి షీట్‌ మాస్క్‌లు ఎంచుకుంటాం. రెండిటినీ ఎప్పుడూ బ్యాగులో పెట్టుకొని తిరగలేం కదా! మరి అత్యవసర పరిస్థితి వస్తే?

Updated : 05 Dec 2021 06:14 IST

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు కొద్ది సమయంలో మెరిపించడానికి మాస్క్‌లు వేస్తుంటాం. సమయముంటే లేపనాలనూ, తక్కువ వ్యవధికి షీట్‌ మాస్క్‌లు ఎంచుకుంటాం. రెండిటినీ ఎప్పుడూ బ్యాగులో పెట్టుకొని తిరగలేం కదా! మరి అత్యవసర పరిస్థితి వస్తే? ఈ కంప్రెస్డ్‌ మాస్క్‌ పిల్స్‌ ప్రయత్నిస్తే సరి! మాత్రకు కొన్ని చుక్కల టోనర్‌ను కలిపితే చాలు. క్షణాల్లో కాటన్‌ ఫేషియల్‌ పేపర్‌గా మారిపోతుంది. ముఖానికి మాస్క్‌లా వేసేసుకోవచ్చు. ఆరాక తొలగిస్తే సరి.. మెరిసే చర్మం మీ సొంతం. చార్కోల్‌, నిమ్మ, కలబంద తదితర ప్లేవర్లలోనూ లభిస్తున్నాయి. మరింకెందుకాలస్యం... ప్రయత్నించేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్