సమంత సీక్రెట్‌ ఇదీ
close
Updated : 05/12/2021 08:08 IST

సమంత సీక్రెట్‌ ఇదీ!

న మెరిసే ఆరోగ్య చర్మానికి హెల్దీ డైట్‌తోపాటు, రోజువారీ జాగ్రత్తలే కారణమంటోంది సమంత. ‘శరీరానికి తగినన్ని నీటిని అందిస్తేనే చర్మం మెరుస్తుంది. అందుకే.. నీటితోపాటు న్యూట్రిషన్లు పుష్కలంగా ఉండే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలనూ ఎక్కువగా తీసుకుంటా. నా రోజును ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ కలిపిన గ్లాసు నీటితో ప్రారంభిస్తా. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. సీటీఎం (క్లెన్సింగ్‌, టోనింగ్‌, మాయిశ్చరైజింగ్‌) రొటీన్‌ను రెండు పూటలా పాటిస్తా. అల్పాహారం రోజు మొత్తం మీద ప్రభావం చూపుతుంది. అందుకే పోషకాలతో నిండిన పండ్లు, బ్రౌన్‌బ్రెడ్‌ వంటి వాటికి ప్రాధాన్యమిస్తా. రోజూ కొద్ది సమయం వ్యాయామాలు, యోగాకు తప్పకుండా కేటాయిస్తా. చర్మరంధ్రాలను శుభ్ర పరచడానికీ, స్కిన్‌ టైటెనింగ్‌కీ స్టీమింగ్‌, ఫేస్‌ రోలర్‌లతోపాటు మైక్రో కరెంట్‌ టూల్‌ను ఉపయోగిస్తా. చర్మం తాజాగా కనిపించడానికి మిసెల్లార్‌ వాటర్‌, వాటర్‌ బేస్డ్‌ సీరమ్‌లనూ వాడతా’ అని చెప్పుకొచ్చింది.


Advertisement

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని