సరిగానే చేస్తున్నారా?
close
Published : 07/12/2021 00:50 IST

సరిగానే చేస్తున్నారా?

ముఖం మీద చిన్న మొటిమ వచ్చినా తట్టుకోలేరు అమ్మాయిలు. దీంతో తోచిన చిట్కానల్లా పాటించేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఇవి ముఖానికి హానీ కలిగించొచ్చు అంటున్నారు నిపుణులు.

ర్మ ఆరోగ్యంలో క్లెన్సింగ్‌ది ప్రధాన పాత్ర. అయితే ఇది 20 సెకన్లకు మించకూడదు. గోరువెచ్చని లేదా చన్నీటినే ఇందుకు ఉపయోగించాలి. రసాయన రహితమైన వాటిని ఎంచుకుంటే మేలు. టోనర్‌, సీరం, మాయిశ్చరైజర్‌, నూనె వంటి వాటిని ముఖం కింది భాగం నుంచి పైకి మృదువుగా అప్లై చేసి, చివర్లో నుదుటిపై రాయాలి. మెడకీ మర్దన చేస్తే డబుల్‌చిన్‌, ముడతలను అరికట్టొచ్చు.

ఇవి వద్దు... జిడ్డు చర్మతత్వం ఉన్న వారు మాయిశ్చరైజర్‌కు దూరంగా ఉండాలి. లేదంటే చర్మ రంధ్రాల్లో నూనె మురికితో కలిసి మొటిమలకు కారణమవుతుంది. పొడి చర్మం ఉన్నవారు లేపనాలను రాస్తే.. పూర్తిగా పొడిబారకముందే వేళ్లను తడిచేసుకుని మృదువుగా రుద్దుతూ...శుభ్రం చేసుకోవాలి. లేదంటే తేమ దూరమై, చర్మం పొడిబారి పగిలినట్లుగా మారే ప్రమాదం ఉంది. మేకప్‌ బ్రష్‌, పఫ్‌ వంటి వాటిపైనా దుమ్ముతోపాటు సూక్ష్మజీవులూ చేరతాయి. ఇవి మేకప్‌తోపాటుగా చర్మ రంధ్రాల్లోకి చేరి సమస్యలను తెస్తాయి. వీటిని వారంలో కనీసం రెండు సార్లు శుభ్రం చేసి గాలిలో ఆరనివ్వాలి. ఇతరుల మేకప్‌ సామాగ్రినీ వినియోగించకపోవడం మంచిది.


Advertisement

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని