Updated : 10/12/2021 05:29 IST

కోరుకున్న కంచి... కడదామా ఎంచి...

కొత్తకొత్తగా... కొంగొత్తగా... లేలేత రంగుల్లో... ముచ్చటైన డిజైన్లలో  కంచి పట్టు చీరలు కనువిందు చేస్తున్నాయి. వేడుక ఏదైనా చక్కని చుక్కలా మెరిసిపోవాలన్నా... హుందాగా కనిపించాలన్నా.. కంచితోనే సాధ్యం... మరెందుకాలస్యం సొగసైన కంచిని కట్టేసుకోండి మరి.

లేత గులాబీ రంగు బ్రొకెడ్‌ కంచిపట్టు చీరపై పరుచుకున్న పసిడి మోటిఫ్‌లు.. చక్కగా నప్పిన  ఆకుపచ్చని అంచూ.... అదిరిపోయాయి.

ఆకర్షణీయమైన సముద్ర నీలం రంగు కంచిపట్టుచీరపై బంగారపు పూలు జల్లినట్లు... చీరంతా పరుచుకున్న పసిడి పూల మోటిఫ్‌లు, ఎర్రటి అంచూ చీరకు కొత్తందాన్ని తెచ్చాయి.


ఈ చీరలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ షోరూమ్‌లో లభిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని