Updated : 12/12/2021 04:41 IST

అందానికి.. బాత్‌ బాంబ్స్‌

కాలమేదైనా చర్మ పరిరక్షణలో స్నానానిదే ప్రధాన పాత్ర. అసలే శీతాకాలం.. చర్మాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు ఈ బాత్‌బాంబ్స్‌ సాయం తీసుకోండి. వీటిని గోరు వెచ్చని నీటిలో వేస్తే చాలు. ఆమ్లాలు వాటర్‌లోకి విడుదలవుతాయి. వీటిలోని గుణాలు దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్‌ చేయడమే కాకుండా దానికి అవసరమైన మాయిశ్చరైజింగ్‌, హైడ్రేషన్‌నూ అందిస్తాయి. దీంతో చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. సిట్రస్‌, లావెండర్‌, గులాబి.. ఇలా భిన్న సువాసనలతో, పలు రంగుల్లోనూ దొరుకుతున్నాయి. ప్రయత్నించి చూడండి మరి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని