Published : 13/12/2021 01:24 IST

స్లీవ్‌లెస్‌ ఇకసమస్యే కాదు!

రష్మికి స్లీవ్‌లెస్‌ టాప్స్‌ చాలా ఇష్టం. అయితే బాహుమూలల్లో చర్మం నల్లబడినట్లుగా అవడంతో నచ్చిన దుస్తులను వేసుకోలేకపోతోంది. ఇది  చాలామందికి ఎదురయ్యే సమస్యే. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటంటే...

* హైపర్‌ పిగ్మెంటేషన్‌, గాఢత ఎక్కువగా ఉండే డియోడ్రెంట్స్‌ వాడటం, శుభ్రత పాటించకపోవడం.. లాంటి కారణాలతో బాహుమూలల్లో చర్మమంతా నల్లగా మారుతుంది. మెలనిన్‌ తగ్గినప్పుడూ ఈ సమస్య ఎదురవుతుంది. తాజా కలబంద గుజ్జును రాసి 20 నిమిషాలు అయ్యాక శుభ్రం చేస్తే చాలు. రెండు రోజులకొకసారి ఇలా చేస్తే మెల్లిగా నలుపు తగ్గుతుంది.

* పావు కప్పు నీటిలో పెద్దచెంచా వంటసోడా కలిపి పేస్టులా చేసి బాహుమూలల్లో అప్లై చేయాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే విటమిన్‌-ఈ లేదా కొబ్బరినూనె రాసి పావుగంట అయ్యాక నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.

*  రెండు చెంచాల చొప్పున వంటసోడా, యాపిల్‌సిడార్‌ వెనిగర్‌ కలిపిన మిశ్రమాన్ని ఆ ప్రాంతంలో రాసి 5 నిమిషాల తర్వాత కడిగేయాలి.

* సహజ బ్లీచింగ్‌ ఏజెంట్‌గా పనిచేసే నిమ్మ చెక్కతో సమస్య ఉన్నచోట ఇలా చేస్తే క్రమేపీ నలుపుదనం దూరమవుతుంది. బంగాళాదుంప రసం లేదా గుండ్రంగా సన్నగా తరిగిన ముక్కతో మృదువుగా రుద్ది ఆరనిచ్చి శుభ్రం చేసినా ఫలితం ఉంటుంది.

* పెరుగు, నిమ్మరసం, పసుపు, శనగపిండిని మిశ్రమంలా చేసి ప్యాక్‌లా వేసి 20 నిమిషాలు ఆరనిచ్చి శుభ్రం చేయాలి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని