Published : 16/12/2021 04:25 IST

ఫ్రూట్‌ క్రీమ్‌.. ప్రయత్నిస్తారా?

ఈ కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... చర్మం పొడిబారే సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఫ్రూట్‌ ఫేషియల్‌ క్రీమ్‌లను ప్రయత్నించి చూడండి. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా..

బొప్పాయితో... కప్పు తాజా బొప్పాయి గుజ్జుకు 2 క్యాప్సూల్స్‌ విటమిన్‌ ఇ ఆయిల్‌, రెండు స్పూన్ల కలబంద గుజ్జు, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని పొడి గాజు సీసాలోకి తీసి ఫ్రిజ్‌లో భద్రపరిస్తే, వారం రోజుల వరకు వాడుకోవచ్చు. స్నానం తర్వాత చేతులు, ముఖం, మెడకు ఈ క్రీమ్‌ను పట్టించి మృదువుగా మర్దన చేసి 20 నిమిషాల తర్వాత చన్నీటితో కడిగేస్తే సరి. చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది.

నారింజ.. తొనల నుంచి గింజలు తీసి లోపలి గుజ్జును జ్యూస్‌ చేసుకోవాలి. ప్రతి రెండు చెంచాల రసానికి చెంచా చొప్పున గ్లిజరిన్‌, ఆలివ్‌ నూనె, రెండు స్పూన్ల కలబంద గుజ్జు కలపాలి. ఓ పొడి గాజు సీసాలోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెడితే 20 రోజులు నిల్వ ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు ముఖం, చేతులకు పట్టిస్తే సరి. దీనిలోని విటమిన్‌ సి, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మెరిసేలానూ చేస్తాయి. యాంటీ ఏజెనింగ్‌గా పనిచేసి, చర్మాన్ని బిగుతుగానూ ఉంచుతుంది.

పుచ్చకాయ.. గిన్నెలో రెండు చెంచాల చొప్పున పుచ్చకాయ రసం, గ్లిజరిన్‌, చెంచా బాదం నూనె, 2 విటమిన్‌ ఇ క్యాప్సూల్స్‌ వేసి బాగా కలపాలి. ఇది మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది. దీన్ని ముఖానికి, మెడకు రాసి అరగంట తర్వాత కడిగేయాలి. ముఖంపై మచ్చలు పోయి మెరుపులీనేలా చేస్తుంది.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని