Published : 18/12/2021 00:39 IST

సహజనూనెలతో చర్మసంరక్షణ

స్నానానికి ముందు ఒంటికి నూనె మర్దనా చర్మాన్ని సంరక్షిస్తుంది. నిమ్మ, నారింజ వంటి వాటితో ఇంట్లోనే చేసుకునే నూనెలు సహజసిద్ధంగా, తాజాగా ఉంటాయి. వీటితో ఈ సీజన్‌లో చర్మాన్ని మృదువుగా మార్చుకోవచ్చు. ఎలర్జీలకూ దూరంగా ఉండొచ్చు. వీటి తయారీ ఎలా అంటే...

* నిమ్మ.. నారింజ: మూడు నిమ్మ లేదా నారింజ కాయలను శుభ్రంగా కడిగి తుడిచి అయిదు నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత వాటిపైన ఉండే పసుపు వర్ణం తొక్క మాత్రమే వచ్చేలా పీలర్‌తో  తురుముకోవాలి. ఆ తురుమును ఓ గిన్నెలోకి తీసుకుని తగినంత కొబ్బరినూనె కలపాలి. దీన్ని డబుల్‌ బాయిలింగ్‌ పద్ధతిలో తురుము నుంచి నూనె బయటికి వచ్చే వరకు కలుపుతూ మరగనివ్వాలి. ఆ తర్వాత చల్లార్చి వడకడితే చాలు. నిమ్మ నూనె సిద్ధం. దీన్ని పొడిసీసాలో భద్రపరుచుకుంటే చాలు. రాత్రి నిద్రపోయే ముందు ఒంటికంతా ఈ నూనెతో మృదువుగా మర్దనా చేస్తే చర్మం పొడి బారకుండా మృదువుగా ఉంటుంది. దురద, రాషెస్‌ వంటి వాటి నుంచి దూరంగా ఉంచుతుంది. ముఖానికి మర్దనా చేసుకుంటే మొటిమలను నివారించి మెరుపును అందిస్తుంది.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని