జుట్టు పలచబడుతోందా
close
Published : 20/12/2021 01:20 IST

జుట్టు పలచబడుతోందా

మగవాళ్లలో ఒక వయసొచ్చే సరికి బట్టతల రావడం సాధారణం. మనకు అలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈమధ్య కొందరు ఆడవాళ్లకి కూడా నుదుటి మీద జుట్టు పలచ బడుతోంది. దాంతో ఇదో పెద్ద సమస్యై కూర్చుంటోంది.

* కురులను పాపిడి తీసి పక్కకు దువ్వుకోవడం సరైన పద్ధతి. అందుకు భిన్నంగా పైకి ఎగదువ్వి గట్టిగా పోనీ వేయడం వల్ల అక్కడ ఒత్తిడి పెరిగి కురులు ఊడటం సహజం. అంతే తప్ప అది బట్టతల కాదు.

* ఎప్పటికప్పుడు విభిన్నంగా కనిపించేందుకు తరచూ హెయిర్‌ స్టయిల్‌ మారుస్తుంటారు కొందరు. కానీ అలా చేయడం వల్ల జుట్టు రాలడం అధికమవుతోందని అధ్యయనాల్లో తేలింది.

* గట్టిగా బిగించి రబ్బర్‌ బ్యాండ్‌ వేయడం, క్లిప్పులు పెట్టడం వల్ల జుట్టు రాలిపోయి బట్టతలలా కనిపించడమే గాక, తలనొప్పికి సైతం దారి తీస్తుందని చెబుతున్నారు. తరచుగా హెయిర్‌ స్ట్రెయిటెనింగ్‌ చేయించుకోవద్దని హెచ్చరిస్తున్నారు. తడి ఆరకముందు జడ అల్లడం లేదా పోనీ వేయడం కూడా మంచివి కాదట.

* ఎండోక్రైన్‌ గ్రంథిలేదా హార్మోన్లలో వచ్చే మార్పులు, తీవ్ర ఇన్‌ఫెక్షన్లు, హై ఫీవర్‌, టైఫాయిడ్‌, సర్జరీల వల్ల జుట్టు రాలే అవకాశముంది. అలాంటప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌ ఉన్న వారిలో జుట్టు రాలే సమస్య అధికం.

* పోషకాహార లోపం, నిద్రలేమి కారణాలతోనూ జుట్టు అధికంగా రాలుతుంది. విటమిన్లు ఉన్న ఆహారం తిని, వేళకు నిద్రపోవడం వల్ల శరీరంలో తక్కిన భాగాల్లాగే కేశాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.


Advertisement

మరిన్ని