Published : 23/12/2021 01:17 IST

ఇంట్లోనే చేద్దాం లిప్‌బామ్‌...

శీతగాలికి అధరాలు పొడారి, మృదుత్వాన్ని కోల్పోతాయి. అయితే వాటిని ఇంట్లోనే చేసుకునే లిప్‌బామ్‌లతో మృదువుగా, తాజాగా మార్చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం...

కావాల్సినవి... రెండేసి చెంచాల కొబ్బరినూనె, బీస్‌వాక్స్‌, కోకోవా బటర్‌, బాదం నూనె, 15 చుక్కల నిమ్మ నూనె.

తయారీ... ఓ గిన్నెలో కోకోవా బటర్‌, బాదంనూనె, బీస్‌వాక్స్‌, కొబ్బరి నూనె వేసి బాగా కలుపుతూ డబుల్‌ బాయిలర్‌ పద్ధతిలో వేడి చేయాలి. చిక్కబడ్డాక పొయ్యిపై నుంచి దింపేయాలి. తర్వాత ఈ మిశ్రమంలో నిమ్మనూనె వేసి మరోసారి కలిపితే చాలు. బామ్‌ సిద్ధం. చల్లారాక పొడిగా ఉన్న చిన్న గాజు బాక్సులోకి తీసి ఫ్రిజ్‌లో భద్రపరుచుకుంటే మూడు నెలలు వాడుకోవచ్చు. రసాయనరహితమైన ఈ బామ్‌ను పెదాలు ఆరినట్లు అనిపించినప్పుడు మృదువుగా రాస్తే చాలు. తాజా అధరాలు మీ సొంతమవుతాయి. అలాగే చెంచా కలబంద గుజ్జులో అరచెంచా కొబ్బరినూనెను వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని  పొడి సీసాలో వేసి ఫ్రిజ్‌లో ఉంచితే నెల రోజులు పెదాలకు బామ్‌లా వాడొచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని