Published : 23/12/2021 01:17 IST

మన ఆభరణాలకు.. అఫ్గాన్‌ హంగులు!

ఫ్యాషన్‌ రంగంలో యాంటిక్‌ సిల్వర్‌ జ్యూలరీకి ఆదరణ ఎక్కువ. క్లాస్‌ లుక్‌తోపాటు ఎవరికైనా ఇట్టే నప్పేస్తాయి. దీంతో వీటికి అఫ్గాన్‌ ట్రైబల్‌ డిజైన్లనూ జోడించేస్తున్నారు డిజైనర్లు. కాయిన్లు, గజ్జెలతోపాటు చిన్న కళారూపాలు వీటి ప్రత్యేకత. జుంకీల నుంచి కాలి అందెల వరకు అన్ని ఆభరణాల్లోనూ వీటిని జొప్పించేస్తున్నారు. మన సంప్రదాయ, ఆధునిక వస్త్రాలకు మరింత నప్పేస్తుండటంతో యువతా వీటిమీద మనసు పారేసుకుంటోంది. తారలూ మెచ్చుతోన్న ఈ ఫ్యాషన్ని మీరూ చూసేయండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని