close
Updated : 25/12/2021 05:45 IST

వధువుకు ఇవి ప్రత్యేకం...

కోటి ఆశలతో వరుడి చిటికెనవేలు పట్టుకుని పెళ్లిపీటలెక్కే నవవధువు కోసం ఇవి ప్రత్యేకం. వధువు ఇంటిపేరు లేదా వధువు అంటూ అక్షరాల్లో డిజైన్‌ చేసి, తళుక్కుమనే రంగులను అద్దుతున్న ఈ ఉంగరాలు, లోలకులు, గాజులు వంటి ఆభరణాలు సహా పాదరక్షలు సైతం నయా ట్రెండ్‌గా నిలుస్తున్నాయి. పెళ్లికూతురి అందాన్ని రెట్టింపు చేస్తూ... సిగ్గులొలికే వధువు ముఖారవిందాన్ని మరింత మురిపెంగా చూపించే లోలకులు, గోరింటాకు పూసిన మృదువైన పాదాలను ముద్దాడే పాదరక్షలు చూడముచ్చటగా ఉంటూ కొత్త ఒరవడిని ప్రదర్శిస్తున్నాయి.


Advertisement

మరిన్ని