Updated : 13/05/2022 15:57 IST

ఈ సీజన్‌లోనూ.. మెరవాలా?

చలి ఒక్కసారిగా పెరిగింది. మామూలుగానే చర్మం పొడిబారుతుంది. ఇప్పుడు మరీ నిర్జీవంగా తయారవుతుంది. మరెలా? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి!

ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచితేనే సహజ మెరుపు వస్తుంది. రోజుకు రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఉదయం తేలికపాటి, రాత్రిపూట ఎక్కువ మాయిశ్చరింగ్‌నిచ్చే క్రీమ్‌లను పూయాలి. దీన్ని ముఖం తడిలేకుండా తుడుచుకున్న వెంటనే చేస్తే మంచిది. స్నానానికి ఎక్కువ వేడినీటిని ఉపయోగిస్తే చర్మం పొడిబారుతుంది. గోరువెచ్చని నీటినే ఉపయోగించాలి.

పాదాలకు గ్లిజరిన్‌ ఆధారిత లేదా పెట్రోలియం జెల్లీ క్రీమ్‌లను పూయాలి. వారానికోసారి అయినా పాదాలను స్క్రబ్‌ చేస్తే మంచిది. మిగతా శరీరంతో పోలిస్తే అరచేతుల్లో నూనె గ్రంథుల శాతం చాలా తక్కువ. అందుకే చేతులు పగలడం, దురదలు వంటివి కనిపిస్తాయి. వీలైనప్పుడల్లా హ్యాండ్‌ క్రీమ్‌/ మాయిశ్చరైజర్‌ పూస్తుండాలి.

బయటికి వెళ్లాల్సొస్తే తప్పక సన్‌స్క్రీన్‌ ఉపయోగించాలి. చలే కదా అన్న అశ్రద్ధ పనికిరాదు. కనీసం ఎస్‌పీఎఫ్‌ 15 ఉన్న మాయిశ్చరైజింగ్‌ సన్‌స్క్రీన్‌ను ఎంచుకోండి.

లిప్‌ కలర్లకు వీలైనంత దూరంగా ఉండండి. ఇవి పెదాల సహజ అందాన్ని దూరం చేస్తాయి. మాయిశ్చరైజింగ్‌ శాతం ఎక్కువగా ఉండే లిప్‌బామ్‌లను ఎంచుకొని, పొడారినట్లు అనిపించినప్పుడల్లా రాస్తే మృదువుగా ఉంటాయి.

చల్లటి వాతావరణం కారణంగా శరీరంలోని నీరంతా త్వరగా ఆవిరైపోతుంది. కాబట్టి చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచాలంటే.. ఎక్కువ మొత్తంలో నీటిని అందించడం తప్పనిసరి. ఎక్కువ మొత్తంలో నీరు, పండ్ల రసాల్ని తీసుకోండి. ఇంట్లో హ్యుమిడిఫయర్‌ని ఏర్పాటు చేసుకున్నా మంచిదే!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని