Updated : 28/12/2021 06:27 IST

ఇవి చూసి కొనండి!

కాస్మెటిక్స్‌ కొనేటప్పుడు అవి మంచివే అని ఎలా నిర్ధరిస్తారు? ఈ విషయాలు తెలుసుకుంటే మీ పని తేలిక అవుతుంది.

కాస్మెటిక్స్‌పై వెనకవైపు ఇన్‌గ్రీడియంట్స్‌ అనే చోట ఆర్టిఫిషియల్‌ ఫ్రాగ్రెన్స్‌ అని ఉంటే వాటి జోలికి పోవద్దు. అవి చర్మంపై దుష్ప్రభావాలు చూపిస్తాయి.

* కొన్నింటిపై మినరల్‌ ఆయిల్‌ అని ఉంటుంది. ఈ మినరల్‌ ఆయిల్‌ మన చర్మ రంధ్రాలని మూసుకుపోయేట్టు చేస్తుంది. ఇది పారాఫిన్‌ అనే పదార్థంతో కలిస్తే తేమ పోయి చర్మం పొడిబారిపోతుంది.

* కొన్ని రకాల క్రీముల్లో సోడియం లారియల్‌ సల్ఫేట్‌ ఉంటుంది. ఇది ముఖంపై మొటిమలు, యాక్నె వంటివి రావడానికి కారణం అవుతుంది. కళ్లలో పడితే వాచి ఎర్రగా అయిపోతాయి.

* మీ సౌందర్య సాధనాల్లో థాలేట్స్‌ ఉంటే ముందే జాగ్రత్త పడాలి. కారణం ఇవి హార్మోన్లపైనే ప్రభావం చూపిస్తాయి.

* పారాబెన్స్‌... ఇవి మనకు డెర్మటైటిస్‌ వంటి వ్యాధులు రావడానికి కారణం అవుతాయి. చర్మం ఎర్రగా కందినట్టుగా అయిపోవడం దీని లక్షణం.

* నూనెల్లో కనుక ఫార్మాల్డిహైడ్‌ ఉంటే అది జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంది.  

* స్క్రబ్బర్లు, పేస్టుల్లో కొన్ని సిలికాన్‌ లేదా పాలిమర్స్‌ ఉంటాయి. వీటిల్లోని సిలికేట్లు మన చర్మానికి చేటు చేయకపోయినా... పర్యావరణానికి తీవ్రమైన హాని చేస్తాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని