Published : 01/01/2022 01:59 IST

పూజా వీటికి దూరమట...

మొటిమలు అంటే భయమంటోంది పూజాహెగ్డే. ఇంకా...‘‘సహజంగా నా చర్మానికి పొడిబారే గుణం ఎక్కువ. అందుకే ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత రెండుపూటలా మాయిశ్చరైజింగ్‌ చేయడం మర్చిపోను. అదే నా చర్మాన్ని తేమగా, తాజాగా ఉండేలా చేస్తుంది. అలాగే ముఖాన్ని వీలైనన్నిసార్లు శుభ్రపరుస్తుంటా. రాత్రి నిద్రపోయే ముందు మేకప్‌ను తొలగించడంలో నిర్లక్ష్యం చేయను. లేదంటే చర్మకణాలకు ఆక్సిజన్‌ అందదు. మొటిమలు, మచ్చలకు ఇది దారితీసే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ విషయంలో శ్రద్ధవహిస్తా. అంతేకాదు, బయటికి వెళ్లినప్పుడు మేకప్‌ చాలా తక్కువగా వేసుకుంటా. ఎందుకంటే షూట్‌లో తప్పనిసరిగా మేకప్‌ అవసరం ఉంటుంది. అందుకే ఖాళీగా ఉన్నప్పుడు ముఖాన్ని మేకప్‌ లేకుండా ఉంచడానికి ప్రయత్నిస్తా. ఇంట్లో ఉండేటప్పుడు తలస్నానం చేసేముందు కొబ్బరినూనెతో చేసే మర్దనా నా జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది నాకు అమ్మ ఇచ్చిన సలహా. పిండిపదార్థాలుండే ఆహారాన్ని తీసుకోను. ఇది నా చర్మాన్ని మెరిసేలా ఉంచుతుంది. ఎక్కువగా నీళ్లు, ద్రవపదార్థాలకు పెద్దపీట వేస్తా. ఇవి నా చర్మాన్ని డీహైడ్రేషన్‌ కాకుండా కాపాడతాయి’’ అని చెబుతోంది.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని