Published : 02/01/2022 00:30 IST

వయసుకు తగినట్లుగా...

వయసుకు తగినట్ల్లుగా కాకుండా ముందుగానే చర్మం ప్రభావితమవుతూ ఉంటుంది. అంటే ముడతలు రావడం, వృద్ధాప్య ఛాయలు రావడం వంటివన్నమాట. అలా కాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు సౌందర్యనిపుణులు.

యసు పెరుగుతున్న కొద్దీ చర్మంపై సన్నగీతలు, రంగు మారడం (పిగ్మంటేషన్‌), ముడతలు, వృద్ధాప్య ఛాయలు వంటివి రావడం సహజం. ప్రస్తుతం చిన్న వయసులోనే ఈ మార్పులన్నీ వస్తున్నాయి. ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, పోషక విలువల్లేని ఆహారం, అధికంగా ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకం వంటివే ఇందుకు కారణం. వయసుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

20లో... హార్మోన్ల ప్రభావంతో ముఖచర్మం పలు మార్పులకు గురవుతుంది. మచ్చలు, మొటిమలు, కళావిహీనత, పొడిబారడం మొదలవుతాయి. వీటికి దూరంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరుచుకోవాలి. రోజూ వ్యాయామం, 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగడం, పోషకాహారాన్ని తీసుకోవడం, తగినంత నిద్ర ఉంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. నిద్రపోయే ముందు అలంకరణను తొలగించడం, మాయిశ్చరైజర్‌తో మృదువుగా మర్దన వంటివి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ తప్పక రాయాలి.

30లో... జీవనక్రియలు నెమ్మదిస్తాయి. చర్మం పొడిబారుతుంది. లేదా ఎక్కువ జిడ్డుగా మారుతుంది. వీటి నుంచి బయటపడాలంటే ముఖానికి రసాయనరహిత లేపనాలు మంచిది.

40లో... చర్మం డీహైడ్రేషన్‌కు గురికావడం, సాగి, ముడతలు పడటం మొదలవుతుంది. కొల్లాజెన్‌, విటమిన్‌ ఏ ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఎత్తుకు తగినంత బరువు ఉండేలా జాగ్రత్తపడాలి.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని