Updated : 08/01/2022 06:35 IST

చర్మమేదైనా.. టొమాటో ఉందిగా!

రాగిణి ముఖానికి ఎన్ని క్రీంలు రాసినా పొడిబారినట్లే ఉంటుంది. స్నిగ్ధ ఏం చేసినా జిడ్డు పోదు. రమణికి మొటిమలొస్తే మచ్చలు పడతాయి. చర్మ తీరు ఏదైనా టొమాటో లేపనాలు బాగా పనిచేస్తాయని తెలుసా!

పొడిచర్మం వారికి... అరటిపండు సగం ముక్కకు అరచెంచా ఆలివ్‌ నూనె, చెంచా టొమాటో రసం కలిపి మెత్తగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసి ఆరనిచ్చి శుభ్రపరిస్తే చాలు. పొడిచర్మాన్ని మృదువుగా మార్చడమే కాదు.. వృద్ధాప్య ఛాయల్నీ దరిచేరనివ్వదు.

జిడ్డు చర్మమైతే... అరకప్పు ఓట్‌మీల్‌కు పావుకప్పు కీరాముక్కలు, తగినంత టొమాటో రసాన్ని కలిపి మిక్సీలో వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పదినిమిషాలు ఆరనిచ్చి గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇది చర్మంలోని జిడ్డును తొలగించి, తేమగా మారుస్తుంది. వారానికి 2, 3 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

మచ్చలు దూరం.. గుప్పెడు పుదీనా ఆకులకు చెంచా టొమాటో రసాన్ని కలిపి మెత్తగా చేయాలి. దీన్ని మచ్చలపై రాసి పావుగంట తర్వాత కడగాలి. వారానికి 4 సార్లు చేస్తే మచ్చలు పోతాయి. రెండు చెంచాల ముల్తానీమట్టికి చెంచా చొప్పున టొమాటో రసం, పాలు కలిపిన మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసి ఆరనిచ్చి 20 నిమిషాల తర్వాత కడగాలి. చర్మం క్లెన్సింగ్‌ అయ్యి, మృతకణాలు పోయి చర్మం మృదువుగా మారుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని