Published : 10/01/2022 01:35 IST

ఈకాలంలో.. మొటిమలు బాధిస్తోంటే

చలికి చర్మం పొడిబారుతోంటే.. కొందరిలో దాని కారణంగా వచ్చే మొటిమలు మరింత బాధిస్తాయి. వీటి నుంచి తప్పించుకోవాలా? ఈ చిట్కాలు పాటించేయండి.

చలికాలంలో మొటిమలకు ప్రధాన కారణం శరీరంలో నీటిశాతం తగ్గడమే. కాబట్టి తరచూ నీటిని తాగుతుండాలి. తద్వారా చర్మం తేమగా ఉండటమే కాదు.. మలినాలూ బయటకు పోతాయి.

సబ్బులు, కొన్నిరకాల ఫేస్‌వాష్‌లు ముఖాన్ని పొడిబారుస్తాయి. తేమనందించే రకాల్ని ఎంచుకోవాలి. చలిగాలుల్లోని తేమ, కాలుష్యం చర్మరంధ్రాల్లోకి చేరి మొటిమలకు దారితీస్తాయి. కాబట్టి క్లెన్సింగ్‌, స్క్రబింగ్‌లకు ప్రాధాన్యమివ్వాలి.

చాలామంది నూనె ఆధారిత మాయిశ్చరైజింగ్‌లను ఎంచుకుంటారు. ఇదీ సమస్యకు కారణమే. నీరు లేదా జెల్‌ ఆధారిత రకాలను ఎంచుకోవాలి. లేపనాలు ఈ కాలంలో చర్మానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. వారానికి కనీసం రెండుసార్లు ప్రయత్నించవచ్చు.

వారానికి ఓసారి మించి స్క్రబ్‌ చేయొద్దు. చర్మంలోని సహజ నూనెలను కోల్పోయే ప్రమాదముంది. పైగా పొడిబారే సమస్యా అధికమవుతుంది. చలిగాలిలో నడవొద్దు. వీలైతే ఇంట్లోనే కసరత్తులు చేయడం మంచిది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని