Updated : 12/01/2022 05:46 IST

మృతకణాలను తొలగించే బియ్యప్పిండి పూత!

రాణి రోజూ ఉదయం, సాయంత్రం బాగా రద్దీలో ఆఫీసుకు రాకపోకలు సాగిస్తుంది. దీని వల్ల ఆమె ముఖం మురికి, దుమ్ము, ధూళి, మృత కణాలతో నిర్జీవంగా మారిపోయింది. ఇలాంటి వారు ఇంకా ఎందరో... మరి వీళ్లు ఏం చేయాలి?

సమస్యకు పరిష్కారం బియ్యప్పిండి స్క్రబ్‌. దీన్ని వేసుకోవడం వల్ల మృతకణాలు తొలగి మోము మెరుస్తుంది. దీన్ని ఎలా చేయాలంటే.. బియ్యప్పిండి, ఎర్రపప్పు ముద్దను గిన్నెలోకి తీసుకుని ఓట్స్‌, ముల్తానీ మట్టి, పసుపు, వేప పొడి వేసి కలపాలి. దీనికి కొన్ని చుక్కల లావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ జోడించాలి. ఈ మిశ్రమంలో రెండు చెంచాల పెరుగు వేసి బాగా కలిపితే బాడీ స్క్రబ్‌ రెడీ.

ఎలా వాడాలంటే.. దీన్ని ముఖం, మెడ, చేతులు, కాళ్లకు రాసి అయిదు నిమిషాలు మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత పది నిమిషాలు ఆగి చల్లటి నీటితో కడిగేయాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే మార్పు మీకే కనిపిస్తుంది.

లాభాలు... బియ్యంలోని యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి. పప్పుల్లోని మాంసకృత్తులు, విటమిన్లు చర్మానికి తేమను అందిస్తాయి.

ముల్తానీ మట్టి చర్మంలో పేరుకున్న సీబమ్‌ను తొలగించి చర్మం పగలకుండా చూస్తుంది. పెరుగు త్వచానికి కావాల్సిన పోషణనివ్వడంతోపాటు సాంత్వన కలిగిస్తుంది. వేప, పసుపులోని యాంటీబ్యాక్టీరియల్‌ సమ్మేళనాలు చర్మాన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని