అందానికి నిమ్మ తోడు
close
Published : 18/01/2022 01:15 IST

అందానికి నిమ్మ తోడు!


మనం రోజూ వాడే నిమ్మ సౌందర్య పోషణలోనూ ఎంతగానో తోడ్పడుతుంది. అదెలానో చూడండి...

మడమల మృదుత్వం.... వేడి నీళ్లలో కొన్ని నిమ్మ చెక్కలను వేసి పాదాలను 10, 15 నిమిషాలు ఉంచండి. లేదా పిండేసిన నిమ్మ డిప్పలను మడమలకు రుద్దినా ప్రయోజనం ఉంటుంది. నిమ్మలోని అల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు బిరుసు చర్మాన్ని మెత్తబరుస్తాయి.

యవ్వనంగా కనిపించాలంటే... చెంచా కొబ్బరి నూనెకు, రెండు చెంచాల నిమ్మరసాన్ని కలిపి ముఖానికి మర్దనా చేయండి. పది నిమిషాలు ఆగి కడిగేయాలి. విటమిన్‌ సి మృత కణాల్ని తొలగించి, ఆరోగ్యవంతమైన చర్మ కణాలు ఎదిగేలా దోహద పడుతుంది. నిమ్మను కొబ్బరి నూనెతో కలపడం వల్ల చర్మం యవ్వనంగా, మెరిసేలా చేస్తుంది.

జుట్టుకు... రెండు చెంచాల నిమ్మరసం, చెంచా ఆలివ్‌ నూన్‌, చెంచా సముద్రపు ఉప్పులను బాగా  కలిపి మాడుకు బాగా పట్టించాలి. పదినిమిషాలు ఆగి తలస్నానం చేయండి. నిమ్మలోని గుణాలు కేశరంధ్రాల్లో రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. ఆలివ్‌ నూనె జుట్టుకు, చర్మానికి అవసరమైన తేమను ఇస్తే, సముద్రపు ఉప్పు చర్మం మీది మృతకణాల్ని తొలగిస్తుంది. దీంతో రాలడం తగ్గి, వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి.


Advertisement

మరిన్ని