Published : 19/01/2022 01:32 IST

చర్మం పొట్టులా రాలుతోందా!

పొడిచర్మం ఉన్న కొందరిలో చలి కాలంలో ముక్కు చుట్టూ, పెదాలకు ఇరు వైపులా, బుగ్గలు, నుదురుపై చర్మం పొరలు పొరలుగా రాలి చూడ్డానికి ఇబ్బందిగా కనిపిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో చూడండి...

రసాయనరహిత ఉత్పత్తులు... ఈ కాలంలో రసాయన, అధిక గాఢత ఉండే సబ్బులు, వాష్‌ల జోలికి వెళ్లొద్దు. వీటివల్ల సమస్య అధికమవుతుంది. సల్ఫేట్‌ లేని, పారాబెన్‌ రహిత ఉత్పత్తులను ఎంచుకోవాలి. ఇవి గాఢత తక్కువగా ఉండి చర్మానికి కావాల్సిన తేమను అందిస్తాయి.

బాదం, విటమిన్‌-ఇ తప్పనిసరి... ఈ రెండింటినీ ఈ కాలంలో ఉపయోగించడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. వీటితో చర్మానికి మర్దనా చేయడం వల్ల కావాల్సిన తేమ లభించి ఆరోగ్యంగా, తాజాగా ఉంటుంది.

మృతకణాలు... వారానికి ఒకటి రెండుసార్లు మైల్డ్‌ స్క్రబ్‌తో మృత కణాలను తొలగించాలి.

మాయిశ్చరైజర్‌ మరవొద్దు.. మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ వాడకం తప్పనిసరి. ఈ రెండూ చర్మాన్ని రక్షిస్తాయి. వీటన్నింటినీ పాటిస్తే చలికాలంలో చర్మం పొరలుగా రాలే సమస్య ఉత్పన్నం కాదు.


Advertisement

మరిన్ని