Published : 21/01/2022 00:41 IST

మేకప్‌ బ్రష్‌లకు ప్రత్యేకం!

మేకప్‌ వేసుకునే వాళ్లందరికీ మేకప్‌ బ్రష్‌లు సుపరిచితమే. పెదాలు, కళ్లు, బుగ్గలు.. ఇలా ఒక్కోదానికి ఒక్కోటి. అతివల సౌందర్యాన్ని పెంచే వీటికీ అందమైన చోటు ఉంటే బాగుంటుంది కదా! అందుకోసమే తయారయ్యాయీ మేకప్‌ బ్రష్‌ వేజెస్‌. కంగారు బ్రష్‌లు వెతుక్కోవడం ఇబ్బంది అవుతుందన్న వారి కోసం ప్రత్యేకంగా గుర్తించే ఏర్పాటూ చేశారు. డ్రెస్సింగ్‌ టేబుల్‌కీ అందాన్ని తెస్తూ భలేగున్నాయి కదూ!


Advertisement

మరిన్ని