పాదరక్షలతో పట్టీలు
close
Published : 22/01/2022 01:47 IST

పాదరక్షలతో పట్టీలు!

అమ్మాయిలు.. కోమలమైన పాదాలకు పట్టీలు పెట్టుకొని అలా నడిచొస్తుంటే చూడ్డానికి ఎంత బాగుంటుంది? ఎక్కువగా ఆధునిక వస్త్రధారణకు ప్రాధాన్యమిచ్చే అమ్మాయిలకు అందియల్ని పెట్టుకునే వీలెక్కడిది! అలాంటి వాళ్లకోసమే సిద్ధమయ్యాయీ చెప్పులు. వేసుకుంటే అచ్చంగా పట్టీలను పెట్టుకున్నట్లే ఉంటాయి. అందుకే భిన్నమైన రకాల్లోనూ తయారు చేశారు. భలేగున్నాయి కదూ! నచ్చితే తెచ్చేసుకోండి మరి!


Advertisement

మరిన్ని