Published : 24/01/2022 00:11 IST

కాఫీ తాగొద్దు.. పూయండి

అందమైన చర్మం కావాలా? అయితే ఎన్నో ప్రయత్నాలూ చేస్తుంటారు. అదనంగా ఇంకొన్నింటినీ చేర్చుకోండి.

దయాలు తాజాగా ప్రారంభమవ్వాలన్నా, పనిలో కాస్త విరామం అవసరమైనా చాలామంది చూపు వెళ్లేది కాఫీ వైపే! కానీ రెండు కప్పులకు మించనివ్వకండి. కెఫిన్‌ చర్మంలో తేమను హరించేస్తుంది. ఒక్కోసారి ఇవి మొటిమలకూ కారణమవుతాయట. కానీ కాఫీని పైపూతగా రాస్తే.. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలు, దద్దుర్లను దూరంగా ఉంచుతాయి. యాంటీ ఏజెనింగ్‌గా పనిచేయడంతోపాటు ముఖంపై మచ్చలు, నల్లని వలయాలనూ తొలగిస్తాయి.

చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లోకి టోనర్‌నీ చేర్చుకోండి. ఇది జీవనశైలిలో మార్పులు, కాలుష్యం ప్రభావం చర్మంపై పడకుండా కాపాడుతుంది. పీహెచ్‌ స్థాయులను నిలకడగా ఉంచుతుంది. రోజుకు రెండుసార్లు ముఖం శుభ్రం చేసుకున్నాక టోనర్‌ తప్పక రాయండి. అలాగే సీరం, ఐక్రీమ్‌ వాటినీ చేర్చుకోవాలి. తరచుగా గ్రీన్‌ టీ బ్యాగులను కళ్లమీద పెట్టుకుంటూ ఉంటే ఆ ప్రాంతంలో ముడతలు, వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చూస్తుంది.

మసాజ్‌.. రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి కణాలన్నింటికీ ఆక్సిజన్‌ చేరేలా చేస్తుంది. ఫలితమే ఆరోగ్యమైన చర్మం. కాబట్టి, ఈ సహజమైన ప్రక్రియను తరచూ చేయండి. గువా షాను ఎంచుకోండి. నున్నని రాయిలా ఉండే ఇది చర్మానికి ఎలాంటి హానీ చేయదు.


Advertisement

మరిన్ని